భార్యను కడతేర్చి.. ఐదేళ్ల కూతురితో.. | Sakshi
Sakshi News home page

భార్యను కడతేర్చి.. ఐదేళ్ల కూతురితో..

Published Mon, Oct 30 2023 1:04 AM

- - Sakshi

 సాక్షి, నిజామాబాద్‌: ఖలీల్‌వాడి నగరంలోని సూర్యనగర్‌లో భార్యను భర్త శనివా రం రాత్రి గొంతునులిమి హత్యచేశాడు. హత్య చేసిన తర్వాత ఐదేళ్ల కూతురితో కలిసి నిందితుడు నాలుగో టౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయాడు. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. బాన్సువాడ మండలంలోని బోర్లం క్యాంపునకు చెందిన ప్రీతి(26)ని, బోధన్‌కు చెందిన ప్రవీణ్‌ ఆరేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అప్పటి నుంచి నగరంలోని సూర్యనగర్‌లో అద్దె ఇంట్లో నివాసముంటున్నారు.

వారికి ఐదేళ్ల కుమార్తె ఉంది. శనివారం రాత్రి భార్యభర్తల మధ్య గొడవ చోటుచేసుకుంది. దీంతో ప్రవీణ్‌ కోపంతో ప్రీతి గొంతునులిమి హత్య చేశాడు. స్థానికులు గమనించి కుటుంబ సభ్యులు, పోలీసులకు సమాచారమిచ్చారు. అంత కుముందే నిందితుడు ప్రవీణ్‌ తన కూతురుతో కలిసి పోలీసుల ఎదుట లొంగిపోయాడు. కాగా సంఘటనా స్థలాన్ని ఏసీపీ కిరణ్‌కుమార్‌, సీఐ నరహరి పరిశీలించి వివరాలు సేకరించారు. ప్రీతి అమ్మమ్మ నాయకోటి విజయలక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Advertisement
 
Advertisement