స్వేచ్ఛగా ఓటేయండి
నిజామాబాద్ అర్బన్: ఓటర్లు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని, అందు కు అవసరమైన అన్ని ఏ ర్పాట్లు పూర్తి చేశామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఇలా త్రిపాఠి అ న్నారు. బుధవారం ఉదయం 7 నుంచి సాయంత్రం 5గంటల వరకు ఓటింగ్ కొనసాగుతుందని, నిర్దేశిత సమయంలో పోలింగ్ కేంద్రాలకు చేరుకున్న ఓటర్లకు టోకెన్లు అందజేసి ఓటు వేసే అవకాశం కల్పిస్తామని తెలిపారు. కలెక్టరేట్‌లో సీపీ సాయిచైతన్య, అదనపు కలెక్టర్ అంకిత్‌తో కలిసి కలెక్టర్ మంగళవారం మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ మార్గదర్శకాలకు అనుగుణంగా సాఫీగా ఎన్నికలను నిర్వహించేందుకు జిల్లాలో మొత్తం 4375 మంది పోలింగ్ సిబ్బందిని నియమించామని తెలిపారు. పోలింగ్ ముగిసిన వెంటనే బ్యాలె ట్ బాక్సులను భద్రత నడుమ స్ట్రాంగ్‌రూమ్‌లకు తరలిస్తామన్నారు.


