స్ట్రైకింగ్ ఫోర్స్.. క్విక్ రియాక్షన్ టీములు
పోలింగ్ సమయంలో ఎక్కడ ఎలాంటి సంఘటన జరిగినా తక్షణమే స్పందించేందుకు వీలుగా స్ట్రైకింగ్ ఫోర్స్, క్విక్ రియాక్షన్ టీములను ఏర్పాటు చేశామని, ఎస్‌ఎస్‌టీ, ఎఫ్‌ఎస్‌టీ బృందాలు గట్టి నిఘా సారిస్తాయని పోలీస్ కమిషనర్ సాయిచైతన్య అన్నారు. పోలింగ్‌కేంద్రాలతో పాటు స్ట్రాంగ్ రూమ్‌లు, కౌంటింగ్ హాళ్ల వద్ద గట్టి బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఏడుగురు ఏసీపీలు, 70 మంది సర్కిల్ ఇన్‌స్పెక్టర్లు, మరో 70 మంది సబ్ ఇన్‌స్పెక్టర్లతో సహా 1370 మంది పోలీసు లు బందోబస్తులో పాల్గొంటున్నారని, ప్రత్యే కంగా మూడు ప్లాటూన్ల పోలీసు బలగాలు జిల్లాకు చేరుకున్నాయని అన్నారు. ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తే ఉపేక్షించబోమన్నారు.


