క్రైం కార్నర్‌ | - | Sakshi
Sakshi News home page

క్రైం కార్నర్‌

Feb 11 2026 7:20 AM | Updated on Feb 11 2026 7:20 AM

క్రైం కార్నర్‌

క్రైం కార్నర్‌

కారు ఢీకొని ఒకరు.. వైన్‌షాపులో చోరీ

ఒంటరి జీవితాన్ని భరించలేక ఆత్మహత్య

సదాశివనగర్‌(ఎల్లారెడ్డి): ఒంటరి జీవితాన్ని భరించలేక ఓ వృద్ధుడు మంగళవారం చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై పుష్పరాజ్‌ తెలిపారు. తిమ్మోజివాడి గ్రామానికి చెందిన దుబ్బాక బాలయ్య(60)కు రామారెడ్డికి చెందిన సత్తవ్వతో 30 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. 15 సంవత్సరాలుగా గొడవల కారణంగా భర్తను వదిలి రామారెడ్డిలోని పుట్టింట్లో కుమారుడు, కుమార్తెతో కలిసి జీవిస్తుంది. అప్పటి నుంచి బాలయ్య ఒంటరి జీవితాన్ని అనుభవిస్తున్నాడు. దగ్గి గ్రామశివారు 44వ జాతీయ రహదారి పక్కన ఓ చెట్టుకు మంగళవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. మృతుడికి కూతురు స్రవంతి, కుమారుడు భానుప్రసాద్‌ ఉన్నారు.

రెండు బైకులు ఢీ.. ముగ్గురికి గాయాలు

రెంజల్‌(బోధన్‌): రెండు బైకులు ఢీకొని ముగ్గురికి గాయాలైనట్లు ఎస్సై చంద్రమోహన్‌ తెలిపారు. సోమవారం రాత్రి సాటాపూర్‌ సమీపంలోని ఫంక్షన్‌ హాల్‌లో శుభకార్యం ముగించుకొని అదే గ్రామానికి చెందిన ఆవుల సాయిలు, లంబాడి బంతి తమ టీవీఎస్‌ ఎక్సెల్‌పై గ్రామానికి వచ్చేందుకు రోడ్డు దాటుతున్నారు. అదే సమయంలో బోధన్‌ వైపు నుంచి పల్సర్‌ బైక్‌పై వస్తున్న దేవేందర్‌ టీవీఎస్‌ ఎక్సెల్‌ను ఢీకొట్టినట్లు పేర్కొన్నారు. ప్రమాదంలో ముగ్గురికి గాయాలు కాగా, కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నట్లు తెలిపారు.

నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): మండలంలోని మాల్తుమ్మెదగేట్‌ వద్ద ద్విచక్రవాహనాన్ని కారు ఢీకొన్న ఘటన మంగళవారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. సిద్దిగారి భూమయ్య తన ఎక్సెల్‌ వాహనంపై రోడ్డును దాటుతుండగా మెదక్‌ జిల్లా పాపన్నపేట మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన గడీల రవీందర్‌రెడ్డి తన కారుతో ఢీకొట్టాడు. ప్రమాదంలో భూ మయ్య తలకు తీవ్రగాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు భూమయ్యను చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు తరలించారు.

సదాశివనగర్‌(ఎల్లారెడ్డి): మండలంలోని పద్మాజివాడి చౌరస్తాలో గల రా జారాణి వైన్‌ షాపులో మంగళవారం తెల్లవారుజామున గుర్తుతెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. వైన్స్‌ షట్టర్‌ తాళం పగులగొట్టి లోపలికి చొరబడి గళ్లపెట్టెలో ఉన్న రూ.650 ల కాయిన్స్‌, రూ.750 విలువ గల రాయల్‌ స్టాక్‌ బాటిల్‌ను ఎత్తుకెళ్లినట్లు ఎస్సై పుష్పరాజ్‌ తెలిపారు. నిర్వాహకుడు శ్రీనివాస్‌ రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు జరుపుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement