ఆర్టీసీ బస్సు ఢీ.. యువకుడి తీవ్ర విషాదం! | - | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ బస్సు ఢీ.. యువకుడి తీవ్ర విషాదం!

Oct 14 2023 1:30 AM | Updated on Oct 14 2023 12:39 PM

- - Sakshi

రంజిత్‌(ఫైల్‌)

నిజామాబాద్‌: నగరంలోని ముబారక్‌నగర్‌ సుజిత్‌ ఫ్యాక్టరీ వద్ద శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో బోదాసు రంజిత్‌ (19) మృతి చెందాడు. రూరల్‌ ఎస్‌హెచ్‌వో మహేశ్‌కుమార్‌ తెలిపిన వివరాలు.. మాక్లూర్‌ మండలం మామిడిపల్లికి చెందిన బోదాసు రంజిత్‌, బోదాస్‌ గంగాధర్‌ వరుసకు అన్నదమ్ములు. వీరు ఇద్దరు మేస్త్రీ పనిచేయడానికి నగరానికి వస్తున్నారు. గంగాధర్‌ బైక్‌ నడుపుతుండగా రంజిత్‌ వెనక కూర్చున్నాడు.

ఈ క్రమంలో జగిత్యాల నుంచి నిజామాబాద్‌ వస్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొంది. వెనక కూర్చున్న రంజిత్‌ కిందపడి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతిడి తల్లి సరోజన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌హెచ్‌వో తెలిపారు. బస్సు డ్రైవర్‌ అజాగ్రత్తగా నడపడం, సుజిత్‌ ఫ్యాక్టరీకి సంబంధించిన లారీలు రోడ్డుపై నిలిపి ఉండటంతోనే ప్రమాదం జరిగిందని మృతుడి బంధువులు రోడ్డు బైఠాయించారు. దీంతో దాదాపు గంట సేపు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. మృతుడి కుటుంబానికి న్యాయం చేస్తామని ఎస్‌హెచ్‌వో హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు.

Advertisement
 
Advertisement
Advertisement