సెంటర్‌లో కేసుల వివరాలు (2017 నుంచి 2026 జూలై వరకు)
గృహహింసే ప్రధాన సమస్య
వన్‌స్టాప్
నుంచే
నిజామాబాద్ రూరల్ : సఖి (వన్ స్టాప్) సెంటర్ బాధిత మహిళల్లో ధైర్యాన్ని నింపుతూ జీవితానికి కొత్త దారి చూపుతోంది. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి ఆవరణలో సంక్షేమ అధికారి నేతృత్వంలో కొనసాగుతున్న సఖి కేంద్రం బాధిత మహిళలను అక్కును చేర్చుకుంటోంది. సుమారు ఎనిమిదిన్నరేళ్ల కాలంలో 4,478 మంది బాధిత మహిళలకు వైద్యం, న్యాయసాయం, తాత్కాలిక ఆశ్రయం, కౌన్సెలింగ్ తదితర సేవలను అందించింది. ప్రతి ఫిర్యాదును కేవలం కేసుగా కాకుండా ఒక కుటుంబ సమస్యగా పరిగణించి కౌన్సెలింగ్, చట్టపరమైన సహాయం, పోలీసు సమన్వయం, వైద్య సేవలు, తాత్కాలిక ఆశ్రయం, పునరావాసం వంటి సేవలు అందిస్తూ అనేక కుటుంబాలను తిరిగి సగౌరవంగా నిలబెట్టింది. 2017 డిసెంబర్ 1 నుంచి 2026 జూలై 31 వరకు మొత్తం 4,478 మంది మహిళలు, బాలికలు సఖి కేంద్రాన్ని ఆశ్రయించారు.
పోక్సో, బాల్య వివాహాలపై ప్రత్యేక దృష్టి
పోక్సో, బాల్య వివాహాలు, గృహహింస, అత్యవసర పరిస్థితుల్లో ఉన్న మహిళలు, బాలికలకు అవసరమైతే రెస్క్యూ ఆపరేషన్లు నిర్వహించి సురక్షితంగా సఖి కేంద్రానికి తరలిస్తున్నారు. అనంతరం పోలీసు శాఖ, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ, జిల్లా బాలల పరిరక్షణ విభాగం, వైద్య శాఖలతో సమన్వయం చేసి న్యాయ సహాయం, వైద్య చికిత్స, కౌన్సెలింగ్, ఆశ్రయం అందిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో తల్లిదండ్రులను పిల్లలు నిర్లక్ష్యం చేయడం, గంజాయికి బానిసైన యువకులు తల్లిదండ్రులను వేధించడం వంటి కుటుంబ సమస్యలపై కూడా సంబంధిత శాఖలకు రిఫర్ చేసి తగిన చర్యలు తీసుకుంటున్నారు.
మహిళల్లో ధైర్యాన్ని నింపే ల క్ష్యంతో సఖి కేంద్రం పని చే స్తుంది. మహిళలకు ఎదుర య్యే అన్ని రకాల సమస్యల ను సెంటర్ పరిష్కరిస్తుంది. భయపడకుండా వస్తే సఖి టీం సమస్యలకు పరిష్కార మార్గాన్ని చూపుతుంది. సమస్యను పూర్తిగా అర్థం చేసుకుని సంబంధిత శాఖలను సమన్వయం చేసుకుంటూ పని చేస్తాం.
– భానుప్రియ, వన్‌స్టాప్ సెంటర్ అడ్మినిస్ట్రేటర్
వేధింపులకు గురైతే మహిళ లు అధైర్య పడకుండా వెంట నే సఖి కేంద్రాన్ని సంప్రదించాలి. మహిళలు, బాలికలకు అన్ని విధాలుగా అండగా ని లచే లక్ష్యంతో సెంటర్ పని చేస్తుంది. మహిళలు నిర్భయంగా తమ బాధలు స ఖి కేంద్రంలో చెప్పుకోవచ్చు. ప్రస్తుతం కాలంలో మహిళలు సైతం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. – డి సౌందర్య, జిల్లా సంక్షేమ అధికారిణి
అగ్ని గోళం కాదు.. ఆకాశం
పొద్దంతా వెలుగులు పంచిన సూర్యుడు.. అస్తమిస్తూ తన కిరణాలతో ఆకాశాన్ని అగ్ని గోళంగా తలపించాడు. బుధవారం సాయంత్రం ఆవిష్కృతమైన ఈ అద్భుత దృశ్యం కనులవిందు చేసింది. ఎరుపు వర్ణానికి నారింజ, బంగారు వర్ణాలు తోడుకావడంతో ఆకాశం ధగధగలాడింది. నందిపేట మండలం బజార్‌కొత్తూర్ శివారులో ‘సాక్షి’ తన కెమెరాలో ఈ దృశ్యాన్ని బంధించింది. – నందిపేట్
చికిత్సతో కొత్త జీవితం
మద్యం, గంజాయి వంటి మత్తు పదార్థాలకు బానిసై కుటుంబ బాధ్యతలను విస్మరించే భర్తల కారణంగా అనేక మంది మహిళలు సఖి కేంద్రాన్ని ఆశ్రయిస్తున్నారు. ఇలాంటి సందర్భాల్లో సఖి కేంద్రం కేవలం మహిళలకు న్యాయ సహాయం అందించడమే కాకుండా, వ్యసనాలకు బానిసైన వ్యక్తులను నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో సైకియాట్రిస్ట్ పర్యవేక్షణలో చికిత్స పొందేలా సమన్వయం చేస్తోంది. అనంతరం వారికి, వారి కుటుంబ సభ్యులకు కౌన్సెలింగ్ నిర్వహించి, మళ్లీ కుటుంబంతో కలిసి సంతోషంగా జీవించేలా కృషి చేస్తోంది. దీంతో అనేక కుటుంబాలు తిరిగి సాధారణ జీవితంలోకి వచ్చాయి.
సఖి కేంద్రానికి వచ్చిన కేసుల్లో అత్యధికంగా 2,717 గృహహింస కేసులు నమోదయ్యాయి. భర్త లేదా అత్తింటి వారి శారీరక, మానసిక వేధింపులు, వరకట్న డిమాండ్‌లు, అనుమానాలు వంటి సమస్యలతో మహిళలు సఖి కేంద్రాన్ని ఆశ్రయిస్తున్నారు.
వరకట్న వేధింపుల కేసులు 598, పోక్సో 254, మిస్సింగ్, కిడ్నాప్ కేసులు 162, సోషల్ మీడియా, సైబర్ మోసాల కేసులు 132, అత్యాచార కేసులు 68, బాల్య వివాహాల కేసులు 39, లైంగిక వేధింపుల కేసులు 9, యాసిదాడి కేసు ఒకటి నమోదైంది.
సోషల్ మీడియా మోసాలు
ఫేస్‌బుక్, ఇన్‌న్‌స్ర్ట్రాగామ్, వాట్సాప్ వంటి సామాజిక మాధ్యమాల ద్వారా పరిచయమైన వారి కారణంగా ప్రేమ పేరుతో మోసపోవడం, డబ్బులు కోల్పోవడం, వ్యక్తిగత ఫొటోలు, వీడియోలతో బ్లాక్‌మెయిల్‌కు గురవడం వంటి 132 కేసులు నమోదయ్యాయి. ఇలాంటి కేసుల్లో సైబర్ పోలీసులతో సమన్వయం చేసి బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటున్నారు సఖి సెంటర్ నిర్వాహకులు.
కన్నీళ్లను తుడిచి కొత్త జీవితాన్నిస్తున్న ‘సఖి’
గృహహింస నుంచి సైబర్ నేరాల
వరకు మహిళలకు ఒకే చోట సేవలు
మానసిక ధైర్యాన్నిస్తున్న సెంటర్
ఆశ్రయం.. పునరావాసం
ఇక్కడి నుంచే..
సఖి కేంద్రం.. అంటేనే కేసులు అనుకోవడం అపోహ మాత్రమే. మహిళల వేధింపుల కేసుల్లో ముందుగా కుటుంబ సభ్యులతో మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషి చేస్తుంది. రాజీ సాధ్యమైన కేసుల్లో కుటుంబాలను మళ్లీ కలిపేందుకు ప్రయత్నిస్తుంది. మహిళ భద్రతకు ముప్పు ఉన్నప్పుడు మాత్రం చట్టపరమైన చర్యలు తీసుకుని పూర్తి రక్షణ కల్పిస్తుంది. ‘ఒక ఫోన్ కాల్... ఒక మహిళ జీవితాన్ని, ఒక కుటుంబ భవిష్యత్‌ను మార్చగలదు. సమస్యను దాచుకోవద్దు... సఖి మీకు అండగా ఉంటుంది’. అంటున్నారు అధికారులు.


