సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: ఆధునిక కాలంలోనూ క్షుద్రపూజలను నమ్మడం మంచిది కాదని, మూఢ నమ్మకాలను వీడాలని టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ్‌కుమార్ గౌడ్ పేర్కొన్నారు. బుధవారం జిల్లాకేంద్రంలోని పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. బీఆర్‌ఎస్ నేత హరీశ్‌రావు తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లోని క్షుద్రపూజల తర హా పూజలు నిర్వహించే ఆలయాల్లో పూజలు నిర్వహించినట్టు తమకు సమాచారం ఉందన్నారు. ఆ యన ఎలాంటి పూజలు చేశారో ప్రజలకు చెప్పాల్సి న అవసరం ఉందన్నారు. ఎల్‌నినోలాంటి పరిస్థితు ల్లో ఆ పూజల మర్మమేంటో ప్రజలకే చెప్పాలన్నందుకు ఎందుకు ఉలిక్కిపడుతున్నాడో అర్థం కావడం లేదన్నారు. కేటీఆర్ తెలంగాణతో పాటు మహారా ష్ట్ర, తమిళనాడులలో ఎక్కడ పాదయాత్రలు చేసినా ఒరిగేదేం లేదన్నారు. బీఆర్‌ఎస్ మళ్లీ అధికారంలోకి రాదని, కాంగ్రెస్సే తిరిగి అధికారంలోకి వస్తుందని పేర్కొన్నారు. ఈసారి 80 శాతానికిపైగా సీట్లు సాధిస్తామన్న ధీమా వ్యక్తం చేశారు. బిహార్‌లోని బంకీపూర్ ఉప ఎన్నికలో ఓటమితో మోదీకి నూకలు చెల్లినట్టేన్నారు. ఏకంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు నబీన్ రాజీనామా చేసిన సీటులో ఓడిపోవడంతోనే బీజేపీ పని అయిపోయిందన్నారు.
జిల్లాకు ఇంజినీరింగ్, వ్యవసాయ కళాశాలల ను తీసుకొచ్చామని, జిల్లా అభివృద్ధే ధ్యేయంగా ముందుకు వెళ్తున్నామని అన్నారు. ధాన్యం సేకరణ విషయంలో కఠినంగా వెళ్లడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులు పూ ర్తి చేయడంపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. జి ల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కే నగేశ్‌రెడ్డి, నగర మేయర్ కే ఉమారాణి, కార్పొరేషన్ డీసీసీ అధ్యక్షుడు బొబ్బి లి రామకృష్ణ, బాడ్సి శేఖర్‌గౌడ్, గడుగు గంగాధర్, మానాల మోహన్‌రెడ్డి, తాహెర్ బిన్ హందాన్, ఏ ఎంసీ చైర్మన్ ముప్పగంగారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ఆ కుల లలిత, భక్తవత్సలం, నరేందర్‌రెడ్డి, జావిద్ అ క్రమ్, సీనియర్ నాయకులు పాల్గొన్నారు.
క్షుద్రపూజలు, మూఢనమ్మకాలు
మంచివి కాదని చెబుతున్నా..
ఈ విషయంలో అంత ఉలిక్కిపాటు
ఎందుకు?
టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్


