నెల వారీగా భూగర్భ జలాలు (మీటర్లలో..)
● ఓడిన కాంగ్రెస్ అభ్యర్థులకు ఫండ్స్
ఇస్తున్నారు : అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్
నియోజకవర్గానికి నయాపైసా ఇవ్వలేదు
సుభాష్‌నగర్: నిజామాబాద్ నగర సమగ్రాభివృద్ధే లక్ష్యంగా తన ప్రతి అడుగు ఉంటుందని అర్బన్ ఎ మ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ అన్నారు. ట్రా ఫిక్ శాశ్వత పరిష్కారం కోసం అవసరమైన వంతెన ల నిర్మాణానికి రూ.100 కోట్లు మంజూరు చేయాలని, రూ.70 కోట్లతో ఎల్లమ్మగుట్ట రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మించాలని, వర్ని, నిజామాబాద్, డిచ్‌పల్లి, ఇందల్వాయి, భీమ్‌గల్, కమ్మర్‌పల్లి వరకు నగరం మీదు గా 107 కిలోమీటర్ల కొత్త జాతీయ రహదారి ప్రతిపాదనలను ఆర్ అండ్‌బీ మంత్రికి అందించినట్లు వివరించారు. నగరంలోని బీజేపీ కార్యాలయంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్ర భుత్వం ఏర్పడి రెండున్నరేళ్లు గడిచినా.. నియోజక వర్గ అభివృద్ధికి నయాపైసా ఇవ్వలేదని, ఓడిన కాంగ్రెస్ అభ్యర్థులకు నిధులను ఇస్తున్నారన్నారు. మేయర్‌కు, కార్పొరేషన్ కమిషనర్‌కు ప్రజా సమస్యలపై పట్టు లేదని మండిపడ్డారు. కార్పొరేషన్‌లో ఉన్న నిధులను కూడా ప్రజావసరాలకు వినియోగించక పోవడం సిగ్గుచేటన్నారు. యువతకు ఉద్యో గ అవకాశాలు కల్పించేందుకు కంపెనీలను తీసుకురావాలని, జీజీహెచ్‌లో సమస్యలను పరిష్కరించాలని, నిజామాబాద్ బస్టాండ్‌లో ప్రయాణికులకు మౌలిక వసతులు కల్పించాలని, కొత్త బస్టాండ్ నిర్మించాలని సంబంధిత మంత్రులకు విన్నవించినట్లు తెలిపారు. అలాగే ఆర్‌వోబీ, ఆర్‌యూబీల నిర్మాణానికి ఎంపీ అర్వింద్‌తో కలిసి కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు ప్రతిపాదనలు అందజేశానన్నారు. నాయకులు, కార్పొరేటర్లు నాగోళ్ల లక్ష్మీనారాయణ, పోతన్‌కర్ లక్ష్మీనారాయణ, మున్సిపల్ ఫ్లోర్‌లీడర్ ప్రమోద్ తదితరులు పాల్గొన్నారు.
డొంకేశ్వర్(ఆర్మూర్) : జూలై నెలాఖరులో వర్షాలు కురిసినప్పటికీ జిల్లాలో భూగర్భ జల మట్టాలు పెరగకపోగా.. ఇంకా లోతులోకి వెళ్లాయి. జూన్‌లో 12.61 మీటర్లలో నీటి మట్టాలు ఉండగా.. జూలై ముగిసే నాటికి 0.32 మీటర్లు తగ్గి 12.93 మీటర్ల లోతులోకి పడిపోయాయి. గతేడాది ఇదే సమయంతో (11.76 మీటర్లు) పోలిస్తే లోటు రికార్డయ్యింది. అయితే.. వర్షపునీరు భూమిలోకి పూర్తిగా ఇంకకపోవడంతోపాటు వ్యవసాయ బోర్ల వాడకం పెరగడమే ఇందుకు కారణమని గ్రౌండ్ వాటర్ డిపార్ట్‌మెంట్ అధికారులు పేర్కొంటున్నారు. జిల్లా వ్యాప్తంగా 82 ఫీజో మీటర్ల ద్వారా భూగర్భ జలాల లెక్కలను ఇటీవల తీశారు. 28 ఫీజో మీటర్లలో 10 మీటర్ల లోపు నీటి మట్టాలు ఉండగా.. 42 ఫీజో మీటర్లలో 10 నుంచి 20 మీటర్ల లోతులో ఉన్నాయి. మరో 12 ఫీజో మీటర్లలో 20 మీటర్ల లోతులో జలాలున్నాయి. వర్షపు నీరు భూగర్భంలోకి ఇంకి ఆగస్టు నెలలో నీటి మట్టాలు పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఇటు జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 50 సెంటీ మీటర్ల వర్షం కురిసింది. ఐదు మండలాలు అధిక, 26 మండలాలు సాధారణ, రెండు మండలాలు లోటు వర్షపాతంలో ఉన్నాయి. వర్షాకాల సీజన్ మొత్తంలో 94 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉంది.
పూర్తిగా నిండని చెరువులు 600కు పైనే..
ఇటీవల భారీ వర్షాలు కురిసినా కూడా జిల్లాలో చాలా చెరువులు పూర్తిగా నిండలేవు. జిల్లాలో 1,097 చెరువులు ఉండగా 25శాతం నీరు చేరిన చెరువులు 221 ఉన్నాయి. అలాగే 25 నుంచి 50 శాతం వరకు నిండిన చెరువులు 385 ఉన్నాయి. అంటే, జిల్లాలో పూర్తిగా నిండని చెరువులు 600కు పైగానే ఉన్నాయి. అదే విధంగా 50 నుంచి 75శాతం నిండిన చెరువులు 296.. 75 నుంచి 100 శాతం నిండినవి 149, అలుగు పారుతున్నవి 46 ఉన్నాయి.
మరో రెండుమూడు సార్లు భారీ వర్షపాతం నమోదైతే తప్ప జిల్లాలోని మిగతా చెరువులు నిండే పరిస్థితి లేదు.
జూలైలో 0.32 మీటర్ల లోతుకు
తగ్గిన భూగర్భ జలాలు
ప్రస్తుతం జిల్లాలో
12.93 మీటర్ల వద్ద నీటి మట్టం
గతేడాదితో పోలిస్తే లోటే


