శ్మశాన వాటిక పరిశీలన | - | Sakshi
Sakshi News home page

శ్మశాన వాటిక పరిశీలన

Aug 6 2026 7:50 AM | Updated on Aug 6 2026 7:50 AM

బోధన్‌టౌన్‌(బోధన్‌): పట్టణంలోని 16వ వార్డులో ఉన్న శ్మశాన వాటికను లోకాయుక్త డిప్యూటీ డైరెక్టర్‌ జైపాల్‌ బుధవారం సందర్శించారు. పట్టణప్రగతిలో భాగంగా రూ.28 లక్షలు వెచ్చించి శ్మశాన వాటికలో చేపట్టిన అభివృద్ధి పనుల్లో నిధులను దుర్వినియోగం చేఽశారనే ఫిర్యాదు మేరకు ఆయన వివరాలు సేకరించారు. ఫిర్యాదుదారుడైన రాజ్‌ విఠల్‌, మున్సిపల్‌ కమిషనర్‌ జాదవ్‌ కృష్ణను పనులపై ప్రశ్నించారు. శ్మశాన వాటికలో చేపట్టిన సీసీ రోడ్డు, ప్రహరీ, టాయిలెట్స్‌ను మున్సిపల్‌ కమిషనర్‌ చూపించారు. ప్రహరీ ఒక పక్కకు ఎందుకు ఒరిగిందని డిప్యూటీ డైరెక్టర్‌ బల్దియా అధికారులను ప్రశ్నించగా.. ప్రహరీని ఆనుకుని డ్రెయినేజీ నిర్మాణం చేపట్టడంతో ఒరిగిందని సమాధానం ఇచ్చారు. శ్మశాన వాటికలో జరిగిన అభివృద్ధి పనులకు సంబంధించిన ఫొటోలు, రికార్డులు తీసుకురావాలని ఆయన సూచించారు. మున్సిపల్‌ చైర్పర్సన్‌ తూము పద్మాశరత్‌రెడ్డి, ఏఈ శ్రీనివాస్‌, స్థానికులు ఉన్నారు.

నేటి నుంచి అందుబాటులో

‘ఎఫ్‌ఎఫ్‌ఎస్‌’ యాప్‌

డొంకేశ్వర్‌(ఆర్మూర్‌): కేంద్ర ప్రభుత్వం కొత్త గా రూపొందించిన ‘ఫ్రేమ్‌ వర్క్‌ ఫర్‌ ఫెర్టిలైజర్‌ సేల్‌ (ఎఫ్‌ఎఫ్‌ఎస్‌)’ యూరియా మొబై ల్‌ యాప్‌ గురువారం నుంచి అందుబాటులోకి రానుందని జిల్లా వ్యవసాయాధికారి వీరాస్వామి బుధవారం ఒక ప్రకటనలో తెలి పారు. ఎరువుల పంపిణీని మరింత పారదర్శకంగా, వేగంగా చేయడానికి కొత్త యాప్‌ ఉపయోగపడుతుందని, యూరియాతో పాటు ఇతర ఎరువులు కూడా బుకింగ్‌ చేసుకొని పొందవచ్చని పేర్కొన్నారు. రైతులు ఆందోళన, గందరగోళానికి గురి కాకుండా కొత్త యాప్‌ను స్మార్ట్‌ ఫోన్‌లో డౌన్‌లోడ్‌ చేసుకోవాలని సూచించారు. యాప్‌ సేవల్లో సందేహాలు ఉంటే స్థానిక వ్యవసాయాధికారులను లేదా ఎరువుల విక్రయ కేంద్రాల్లో సంప్రదించాలని సూచించారు.

‘సైబర్‌’ వలకు చిక్కొద్దు

మాక్లూర్‌: సాంకేతిక రంగం ఎంత వేగంగా అభివృద్ధి చెందుతోందో అంతే వేగంగా సైబర్‌ నేరాలు పెరుగుతున్నాయని, సైబర్‌ నేరగాళ్ల వలకు చిక్కొద్దని సీపీ సాయిచైతన్య ప్రజలకు సూచించారు. జాతీయ సైబర్‌ జాగృతి దివస్‌ను పురస్కరించుకుని తెలంగాణ సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో ఆదేశం మేరకు బుధవారం దాస్‌నగర్‌లోని విజయ్‌ రూరల్‌ ఇంజినీరింగ్‌ కళాశాలలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఎస్సై అనిల్‌రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమానికి సీపీ సాయిచైతన్య ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. అప్రమత్తతే రక్షణ, ధ్రువీకరణే భద్రత, అవగాహనే ఆయుధమని అన్నారు. ఈ మూడింటిని యువత, ప్రజలు పాటించినప్పుడు సైబర్‌ నేరగాళ్ల బారిన పడకుండా ఉంటామన్నారు. అనంతరం సైబర్‌ నేరాల అవగాహన పోస్టర్‌ను ఆవిష్కరించడంతోపాటు విద్యార్థులతో భారీ ర్యాలీ నిర్వహించారు. మత్తు పదార్ధాలకు దూరంగా ఉంటామని విద్యార్థులతో ప్రమాణం చేయించారు. ఏసీపీ బి ప్రకాశ్‌యాదవ్‌, నార్త్‌ జోన్‌ సీఐ శ్రీనివాస్‌రావు, సైబర్‌ క్రైం సీఐ ముఖీద్‌పాషా, సైబర్‌ క్రైమ్‌ ఎస్సైలు రవికుమార్‌, ప్రవళిక, విజయ్‌ రూరల్‌ ఇంజినీరింగ్‌ కళాశాల ప్రిన్సిపాల్‌లు గణేశ్‌, సురేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement