నిర్మల్‌టౌన్: జిల్లా కేంద్రంలోని ప్రధాన కోర్టు, భైంసా, ఖానాపూర్ కోర్టులలో శనివారం జాతీయ లోక్‌అదాలత్ నిర్వహించారు. జిల్లా జడ్జి శ్రీవాణి, సీనియర్ సివిల్ జడ్జి పోరిక రవీందర్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. జిల్లా జడ్జి శ్రీవాణి మాట్లాడుతూ.. ప్రజలు లోక్‌అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. చెక్ బౌన్స్, సివిల్, భూతగాదాలు తది తర కేసులను పరస్పర అంగీకారంతో త్వరగా పరిష్కరించుకోవాలన్నారు. కోర్టుల చుట్టూ తిరిగే సమయం, ఖర్చును తగ్గించుకోవడంతో పాటు ఇరుపక్షాలకు సంతృప్తికరమైన పరిష్కా రం లభిస్తుందని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా లోక్‌అదాలత్‌లో 8 సివిల్, 1,330 క్రిమినల్ కేసులు పరిష్కరించినట్లు వివరించారు. అలాగే బ్యాంకు రికవరీ కేసుల్లో నిర్మల్ కోర్టులో 4 కేసులకు సంబంధించి రూ.2,02,000, భైంసా కోర్టులో 10 కేసులకు రూ.13,86,350, ఖానా పూర్ కోర్టులో 11 కేసులకు రూ.11,15,000 రికవరీ అయినట్లు వివరించారు.


