మామడ: మండలంలోని పొన్కల్ సదర్మాట్ బ్యారేజీని ఇంజనీరింగ్ అధికారులు, నిపుణుల బృందం శనివారం తనిఖీ చేసింది. ప్రాజెక్టు నిర్మాణం పూర్తయిన అనంతరం మొదటి సారిగి ప్రాజెక్ట్‌లో నీటిని నిల్వ చేస్తున్నారు. బ్యారేజీలో నీటి నిల్వ, గేట్ల నిర్వహణ, లీకేజీలు, కట్ట నిర్మాణం పరిశీలించి వివరాలను నమోదు చేశారు. బ్యారేజీ పూర్తిస్థాయి నీటి సామార్థ్యం 1.58 టీఎంసీలు కాగా, ప్రస్తుతం బ్యారేజీలో 1.2 టీఎంసీల నీరు నిల్వ ఉంది. బృందంలో రిటైర్డ్ ఈఎన్‌సి శ్రీనివాస్, సీఈ జగదీశ్, ఎస్‌ఈ రాజేంద్రప్రసాద్, డీసీఈ మధుసూదన్‌రెడ్డి, ఈఈ అనిల్, డీఈ సురేందర్, ఏఈ నవీన్‌కుమార్, రోషన్ ఉన్నారు.


