నిర్మల్‌ఖిల్లా: బాల సాహిత్య వికాసానికి విశేషంగా కృషి చేస్తున్న జిల్లా కవులను సిరిసిల్ల జిల్లాకేంద్రంలోని రంగినేని సుజాత మోహన్‌రావు ఎడ్యుకేషనల్ అండ్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో శనివారం ఘనంగా సన్మానించారు. ట్రస్ట్ నిర్వహించిన రాష్ట్రస్థాయి ‘బాల సాహిత్యం–పిల్లల పండుగ’ మహోత్సవంలో పాల్గొని, బాల సాహిత్య అభివృద్ధికి చేపట్టాల్సి న కార్యక్రమాలు, భవిష్యత్ దిశాదశలను వివరించిన జిల్లా కవులను సత్కరించారు. బాల సాహిత్య వికాసానికి నిరంతరం కృషి చేస్తున్న కడారి దశరథ్, కొండూరు పోతన్న, కందకుర్తి దేవిప్రియ, జాధవ్ పుండలీక్‌రావు పాటిల్‌ను ట్రస్ట్ ప్రతినిధులు సన్మానించి అభినందన ప త్రాలను అందజేశారు. కార్యక్రమంలో పిల్లల పండుగ అధ్యక్షుడు రంగినేని మోహన్‌రావు, ర ంగినేని ట్రస్ట్ అధ్యక్షుడు రంగినేని నవీన్‌కుమార్, పిల్లల పండుగ కన్వీనర్ అమూల్య, పిల్లల పండుగ అధ్యక్షుడు గరిపెల్లి అశోక్ పాల్గొని కవులను సన్మానించారు.


