నిర్మల్‌చైన్‌గేట్: తెలంగాణ రాష్ట్రంలో పెండింగ్‌లో ఉ న్న రూ.14 వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకా యిలు ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని బీ సీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ ఆధ్వర్యంలో ఆర్డీవో కార్యాల యం ఎదుట సోమవారం నిరసన తెలిపారు. అనంతరం కలెక్టరేట్‌లో వినతిపత్రం అందజేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న దాదాపు 30 లక్షల మంది విద్యార్థులు కళాశాలల్లో చదువులు కొనసాగించలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ఫీజు చెల్లింపులతో నిమిత్తం లేకుండా విద్యార్థుల ఒరిజినల్ సర్టిఫికెట్లు కళాశాల యాజమాన్యాలు వెంటనే అందజేసేలా ప్రభుత్వం తక్షణమే జీవో విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ సభ్యులు రామగిరి రవీందర్, జిల్లా అధ్యక్షుడు యాటకారి సాయన్న, ఉపాధ్యక్షుడు గొడుగు గంగాధర్, ప్రధాన కార్యదర్శి బోడ గంగాధర్‌యాదవ్, కార్యదర్శి కల్లూరు సుధాకర్, అధికార ప్రతినిధి ముద్రపోయిన వినేష్, బర్మ శ్రీకాంత్, శ్రీనివాస్, నిగుర్లకు లింగన్న, కుందూరు వినోద్, మేకల సింహం, అశోక్, రాము, నరసయ్య పాల్గొన్నారు.


