జపాన్‌ పిల్లలకు జాడి శ్రీనివాస్‌ పాఠాలు | - | Sakshi
Sakshi News home page

జపాన్‌ పిల్లలకు జాడి శ్రీనివాస్‌ పాఠాలు

Sep 11 2026 11:54 PM | Updated on Sep 11 2026 11:54 PM

ఖానాపూర్‌: మండలంలోని మస్కాపూర్‌ పీఎంశ్రీ పాఠశాల గణిత ఉపాధ్యాయుడు జాడి శ్రీని వాస్‌ అంతర్జాతీయ వేదికపై మెరిశాడు. తెలంగాణ పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ నవీన్‌ నికోలస్‌ నేతృత్వంలో 29 మంది ఉపాధ్యాయులు, ఎస్‌సీఈఆర్‌టీ సభ్యులు, వ్యక్తిత్వ వికాస నిపుణులతో కూడిన బృందం జపాన్‌లో విద్యా మా ర్పిడి, అధ్యయన పర్యటనలో ఉంది. యూనివర్సిటీ ఆఫ్‌ సుకుబా, చియోడా యూనివర్సిటీ, ఒట్సుకా ఉన్నత విద్యాసంస్థలు సహా ప్రముఖ పాఠశాలలు, సాంకేతిక సంస్థలను సందర్శించా రు. టోక్యో కోసెన్‌ రోబోటిక్‌ విద్యావిధానాన్ని అధ్యయనం చేశారు. ఉపాధ్యాయుల వృత్తిపరమైన అభివృద్ధి, శిక్షణ, ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థులకు సాంకేతిక సహాయంతో అందిస్తున్న సమగ్ర విద్యా విధానాలను కూడా పరిశీలించారు.

పరిశోధనా పత్ర ప్రదర్శన..

అంతర్జాతీయ సదస్సులో మస్కాపూర్‌ పాఠశాల ఉపాధ్యాయుడు శ్రీనివాస్‌ తన పరిశోధనా పత్రాన్ని సమర్పించారు. తెలంగాణలో అమలవుతున్న వినూత్న గణిత బోధనా పద్ధతులు, విద్యార్థుల ప్రతిభాభివృద్ధి, నైపుణ్యాల పెంపుపై వివరాలు అందించారు. ఆయన ప్రదర్శనను అభినందిస్తూ జపాన్‌ ఇంటర్నేషనల్‌ కోఆపరేషన్‌ సెంటర్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఆకావో, పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ నవీన్‌ నికోలస్‌ కలిసి ప్రశంసాపత్రం అందజేశారు. పర్యటనలో భాగంగా జాడి శ్రీనివాస్‌ జపాన్‌లోని ఒక జూనియర్‌ హైస్కూల్‌లో 9వ తరగతి విద్యార్థులకు గణితం బోధించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement