జిల్లాలోని నిర్మల్ రూరల్, సోన్, లక్ష్మణచాంద, మామడ, ఖానాపూర్, కడెం, పెంబి మండలాల్లో సరస్వతి కాలువ ప్రవహిస్తుంది. మొదట్లో ఎల్‌ని నో కారణంగా వర్షాలు తక్కువగా కురుస్తాయని వ్యవసాయాధికారులు సూచించడంతో కాలువ ఆయకట్టు కింద పంటలు సాగు చేయవద్దని రైతులు భావించారు. అయితే జూలైలో వర్షాలు ఆశాజనకంగా కురవడంతో ప్రాజెక్టు నిండి కాలువకు నీరు విడుదలవుతుందని ఆశతో పంటలు సాగు చేశారు. కానీ ఆగస్టులో వర్షాలు లేక ప్రాజెక్టు నిండకపోవడంతో సరస్వతి ఆయకట్టు కింద సాగు చేస్తున్న వరి, మొక్కజొన్న, సోయా, పత్తి పంటలు ఎండిపోతున్నాయి.


