నిర్మల్‌టౌన్: ఐదు రోజుల బ్యాంకింగ్ విధానం అమలు చేయాలని, ప్రభుత్వం ఏకపక్షంగా తీసుకొచ్చిన పీఎల్‌ఐ(పర్ఫార్మెన్స్ లింక్డ్ ఇన్సెంటివ్) స్కీమ్‌ను ఉపసంహరించుకోవాలని బ్యాంకు ఉద్యోగులు శుక్రవారం సమ్మె చే శారు. నిర్మల్ రీజియన్ యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని ఎస్‌బీఐ మెయిన్ బ్రాంచ్ ఎదుట ఉద్యోగులు నిరసన తెలిపారు. ప్రధాన డిమాండు పరిష్కరించాలని ఈనెల 28, 29, 30 తేదీల్లో దేశవ్యాప్తంగా సమ్మె నిర్వహించనున్నట్లు యూనియన్ ప్రతినిధులు తెలిపా రు. అప్పటికీ సమస్యలు పరిష్కారం కాకపోతే అక్టోబర్ 26 నుంచి నిరవధిక సమ్మెకు దిగుతామని హెచ్చరించారు. సమ్మెలో టి.శ్రీనివాస్, శ్రీధర్, లక్ష్మణ్, పోశెట్టి, వివిధ బ్యాంకుల ఉద్యోగులు పాల్గొన్నారు


