నిర్మల్‌టౌన్: పోలీస్ అమరవీరుల కుటుంబా లకు సంక్షేమ ప్రయోజనాలు సులభంగా అందేలా ప్రభుత్వం రూపొందించిన టీజీ వీర్ ఫ్యామిలీ కార్డులు ఎస్పీ జానకీషర్మిల శుక్రవారం పంపిణీ చేశారు. ఆర్థిక సహాయం, పింఛన్లు, కారుణ్య నియామకాలు, ఇంటి స్థలాలు తదితర ప్రయోజనాల వివరాలు ఈ కార్డు ద్వారా నమోదు చేసి, వాటి పురోగతిని సులభంగా తెలు సుకునే అవకాశం ఉంటుందన్నారు. ప్రజల రక్షణ కోసం ప్రాణత్యాగం చేసిన పోలీస్ అమరవీరుల సేవలు చిరస్మరణీయమన్నా రు. వారి కుటుంబాల సంక్షేమానికి పోలీస్ శాఖ అండగా ఉంటుందన్నారు. భైంసా ఏఎస్పీ సాయికిరణ్, నిర్మల్ డీఎస్పీ శ్రీనివా స్, పాల్గొన్నారు.


