నిర్మల్‌చైన్‌గేట్: జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రికి వైద్యం కోసం వచ్చే ప్రజలకు మెరుగైన, నాణ్యమైన వైద్యం అందేలా చర్యలు తీసుకో వాలని కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ కా ర్యాలయంలో వైద్యాధికారులు, వివిధ విభాగా ల అధిపతులతో శుక్రవారం సమీక్షించారు. రోజు వారీగా నమోదవుతున్న ఓపీ వివరాలతోపా టు వివిధ విభాగాల్లో అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. జనరల్ మెడిసిన్, గైనకాలజీ, ఆర్థోపెడిక్, కార్డియాలజీ, రేడియాల జీ, ఈఎన్‌టీ తదితర విభాగాల్లో వైద్య సేవల మెరుగుదలకు అవసరమైన పరికరాలు, శస్త్రచికిత్సకు అవసరమైన యంత్రాల వివరాలు సేకరించారు. అవసరమైన పరికరాలను ప్రాధాన్యత క్రమంలో సమకూర్చేందుకు చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు. రోగులకు మెరుగైన వైద్యం అందేలా మౌలిక వసతులు కల్పిస్తామన్నారు. ఆస్పత్రి ప్రాంగణంలో పార్కింగ్ సమస్యలు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అనంతరం పార్కింగ్ స్థలాన్ని కలెక్టర్ స్వయంగా పరిశీలించారు. సమావేశంలో ఆస్పత్రి పర్యవేక్షకులు గోపాల్‌సింగ్, అధికారులు రమేశ్, సరోజ, వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.


