నిర్మల్‌చైన్‌గేట్: ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న మధ్యాహ్న భోజన కార్మికుల పెండింగ్ వేతనాలు, బిల్లులను వెంటనే విడుదల చేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి బొమ్మెన సురేశ్ డిమాండ్ చేశారు. ఈమేరకు డీఈవో కార్యాలయం ఎదుట గురువా రం ధర్నా నిర్వహించారు. నెలల తరబడి వేతనా లు, బిల్లులు పెండింగ్‌లో ఉండడంతో కార్మికులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఆన్‌లైన్ ప్రక్రియ పేరుతో బిల్లులు తిరస్కరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన విధంగా వేతనాన్ని నెలకు రూ.10 వేలకు పెంచాలని డిమాండ్ చేశారు. మార్కెట్ ధరలకు అనుగుణంగా మెస్ చార్జీలు, కోడిగుడ్ల బిల్లులు పెంచాలని, గత ప్రభుత్వ హయాంలో పెండింగ్‌లో ఉన్న అల్పాహారం బిల్లులను చెల్లించడంతోపా టు రాగిజావాకు ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలన్నా రు. ధర్నాలో యూనియన్ నాయకులు కె.రాధ, లక్ష్మి, సునీత, భాను పాల్గొన్నారు.


