అకారణంగా మాల్‌ప్రాక్టీస్ అంటూ ఫలితాన్ని ప్రకటించి విద్యార్థుల విలువైన జీవితాన్ని దెబ్బతీయడం సరికాదు. గంగాభవాని విద్యాసంవత్సరం కోల్పోవడానికి యూనివర్సిటీ బాధ్యత వహించాలి. – సింగరి వెంకటేశ్,
పీడీఎస్‌యూ జిల్లా అధ్యక్షుడు
అడిగినా వివరాలు ఇవ్వలేదు..
నా బిడ్డ బాగా చదివి పరీక్షలన్నీ మంచిగా రాసింది. అయినా ఫలితాల్లో మాల్‌ప్రాక్టీస్ అని ఇచ్చారు. ఎందుకిలా ఇచ్చారని వరంగల్ దాకా రెండుమూడుసార్లు వెళ్లి యూనివర్సిటీ సార్లను అడిగినం. కానీ.. వారు సరైన సమాచారం ఇవ్వకుండా.. మళ్లీ పరీక్షలు రాయాల్సిందే.. అంటూ తిప్పిపంపించారు.
–బర్కుంట గంగారాం, గంగాభవాని తండ్రి


