న్యూస్‌రీల్
పాఠశాలలు ప్రారంభమై మూడు నెలలు.. ఇప్పటికీ మొదలు కాని అల్పాహారం
నిర్మల్
మట్టి గణపతులను పూజిద్దాం
నిర్మల్‌చైన్‌గేట్: మట్టి గణపతులు పూజించి పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత మనందరిపై ఉందని అదనపు కలెక్టర్ బి.వెంకటేశ్వర్లు అన్నారు. కలెక్టరేట్‌లో గురువారం అధికారులకు, సిబ్బందికి అదనపు కలెక్టర్ మట్టి గణపతి విగ్రహాలు ఉచితంగా పంపిణీ చేశారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలు, కృత్రిమ రంగులతో పర్యావరణానికి ఎంతో హాని కలుగుతుందన్నారు. ప్రతి ఒక్కరూ మట్టితో చేసిన విగ్రహాలనే పూజించాలన్నారు.
లక్ష్మణచాంద: రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల ను బలోపేతం చేసేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టింది. అనేక మంది విద్యార్థులు ఉదయం ఇంట్లో సకాలంలో ఆహారం దొరకక, ఖాళీ కడుపుతోనే పా ఠశాలకు చేరుతున్నారు. మధ్యాహ్నం వరకు ఆకలి తో ఉండడంతో పాఠాలపై దృష్టి సారించలేకపోతున్నామని వారు చెబుతున్నారు. ఈ సమస్యను గమనించిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు బ్రేక్‌ఫాస్ట్ అందించాలని నిర్ణయించారు. సెంట్రలైజ్డ్ కిచెన్ ద్వారా ప్రతిరోజూ నాణ్యమైన, రుచికరమైన ఒక రకం అల్పాహారం అందిస్తామని తెలిపారు. ముందుగా హైదరాబాద్ చుట్టుపక్కల పాఠశాలల్లో ప్రారంభించి, తర్వాత రాష్ట్రవ్యాప్తంగా విస్తరిస్తామని తెలిపారు.
జిల్లాలో 40,365 మంది..
జిల్లాలో 498 ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు, 82 ప్రాథమికోన్నత పాఠశాలలు, 118 ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. మొత్తం 698 పాఠశాలల్లో 40,365 మంది విద్యార్థులు చదువుతున్నారు. బ్రేక్‌ఫాస్ట్ పథకం అమలైతే ఈ విద్యార్థులందరికీ ప్రయోజనం చేకూరుతుంది.
హరేకృష్ణ సంస్థకు బాధ్యత
ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు అల్పాహారం అందించే బాధ్యతను తెలంగాణ ప్రభుత్వం హరేకృష్ణ సంస్థకు అప్పగించింది. హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో జూన్ 15న ఈ కార్యక్రమం ప్రారంభమైంది. ఇటీవల ఇతర జిల్లాల్లో కూడా ప్రారంభిస్తున్నారు. జిల్లా పాఠశాలల్లో ఇంకా ప్రారంభం కాలేదు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఖాళీ కడుపుతో చదువుతున్న విద్యార్థులు, దీని ప్రభావం చదువుపై పడుతోందని వాపోతున్నారు.
స్థల పరిశీలన పూర్తి..
జిల్లాలో సెంట్రలైజ్డ్ కిచెన్ ఏర్పాటు కోసం హరేకృష్ణ సంస్థ ప్రతినిధులు గత నెల జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులోని గోదామును పరిశీలించారని జిల్లా విద్యాశాఖ అధికారులు తెలిపారు. స్థల పరిశీలన పూర్తయిందని వారు చెప్పారు. హరేకృష్ణ సంస్థ బృందం ‘సాక్షి’తో మాట్లాడుతూ, రెండు, మూడు రోజుల్లో సెంట్రలైజ్డ్ కిచెన్ ఏర్పాటు పనులు ప్రారంభిస్తామని తెలిపింది. పనులు పూర్తి చేసి రెండు నుంచి రెండున్నర నెలల్లోగా విద్యార్థులకు అల్పాహారం అందించే ప్రక్రియ మొదలుపెడతామని పేర్కొన్నారు.
ఉద్యాన పంటలపై అవగాహన
తానూరు: మండలంలోని కోలూరు, ఎల్వత్ గ్రామాల్లో రైతులు సాగు చేసిన ఉద్యాన పంటలను జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖ అధికారి బీవీ.రమణ పరిశీలించారు. కూరగాయల సాగు లాభదాయకమన్నారు. తక్కువ పెట్టుబడితో ఆర్థికంగా ఎదగాలని సూచించారు. కూరగాయలు సాగుచేసే రైతులు ముందుగా ఉద్యానవన అధికారులకు దరఖాస్తులు చేసుకుంటే వారికి ప్రభుత్వం ద్వారా సబ్సిడీ అందిస్తామని తెలిపారు. ఆయన వెంట ఉద్యానవన విస్తరణ అధికారి జావీద్‌పాషా, మోయిన్ మియా, కోలూరు సర్పంచ్ మాధవ్‌రావు రైతులు ఉన్నారు.
జిల్లా సమాచారం....
ప్రాథమిక పాఠశాలలు 498
ప్రాథమికోన్నత పాఠశాలలు 82
ఉన్నత పాఠశాలలు 118
లబ్ధి చేకూరే విద్యార్థులు 40,365


