బాసర: గోదావరి పుష్కరాల పనులు సమన్వయంతో చేపట్టాలని కలెక్టర్ భవేశ్‌మిశ్రా అధికారులను ఆదేశించారు. ఎస్పీ జానకీషర్మిలతో కలిసి బాసర ఈవో కార్యాలయంలో గురువారం సమీక్ష నిర్వహించారు. పుష్కర స్నానాల కోసం బాసరకు వచ్చే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని తగిన ఏర్పాట్లు చేయాలన్నారు. వీఐపీ, వీవీఐపీలకు ప్రత్యేకంగా పార్కింగ్ సౌకర్యం ఏర్పాటు చేయాలన్నారు. పనులన్నీ నాణ్యతతో ఉండాలని సూచించారు. భక్తుల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పారు. హెలీ ప్యాడ్ ఏర్పాటు చేయాలని తెలిపారు. ఎస్పీ జానకీషర్మిల మాట్లాడుతూ, పుష్కరాలకు వచ్చే భక్తులకు భద్రత కల్పిస్తామన్నారు. సంబంధిత శాఖల అధికా రుల సమన్వయంతో భక్తులకు ఇబ్బందులు లేకుండా చూస్తామని తెలిపారు. కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి, కేంద్రీకృత విధానం ద్వారా నిఘా ఉంచుతామన్నారు. సీసీ కెమెరాల సహాయంతో భక్తుల భద్రతను పర్యవేక్షిస్తామని తెలిపారు. సమావేశంలో ఆర్‌అండ్‌బీ, ఆర్‌డబ్ల్యూఎస్, పంచాయతీరాజ్, నీటిపారుదల శాఖల ఈఈలు సుభా ష్, సందీప్, శంకరయ్య, అనిల్, ఆలయ ఈవో అంజనాదేవి, తహసీపవన్ చంద్ర పాల్గొన్నారు.


