చాకలి ఐలమ్మ వర్ధంతి | - | Sakshi
Sakshi News home page

చాకలి ఐలమ్మ వర్ధంతి

Sep 11 2026 10:57 AM | Updated on Sep 11 2026 10:57 AM

నిర్మల్‌చైన్‌గేట్‌: కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో వీరనారి చాకలి ఐలమ్మ వర్ధంతి కార్యక్రమం గురువారం నిర్వహించారు. అదనపు కలెక్టర్‌ బి.వెంకటేశ్వర్లు అధికారులతో కలిసి ఐలమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. రెండు నిమిషాలు మౌనం పాటించారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో ఐలమ్మ పాత్రను వివరించారు. నాటి కాలంలోనే దొరలు, భూస్వాములకు వ్యతిరేకంగా పోరాటం చేసి తెలంగాణ పోరాటాల చరిత్రలో ఒక గొప్ప అధ్యాయాన్ని లిఖించిందని తెలిపారు. చాకలి ఐలమ్మ ఉద్యమ స్ఫూర్తితో మనమంతా ముందుకు సాగాలన్నారు. కార్యక్రమంలో ఎస్సీ సంక్షేమ అధికారి దయానంద్‌, ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ శంకర్‌, సీపీవో గంగారెడ్డి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement