న్యూస్‌రీల్
నిర్మల్
వెంగ్వాపేట్‌లో కార్డన్ సెర్చ్
నిర్మల్ రూరల్: మండలంలోని వెంగ్వాపేట్ గ్రామంలో ఆదివారం ఉదయం డీఎస్పీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో రూరల్ పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ధ్రువపత్రాలు లేని 83 ద్విచక్ర వాహనాలు, ఆటో, టాటా మ్యాజిక్‌ను సీజ్ చేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ శ్రీనివాస్ మాట్లాడుతూ.. నేరాల నియంత్రణకే కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కాలనీలో కొత్త వ్యక్తులు షెల్టర్ తీసుకుని ఉంటే పోలీసులకు సమాచారం అందించాలన్నారు. యువత చెడు అలవాట్లు బానిస కావొద్దని సూచించారు. గ్రామంలో ఎవరైనా గంజాయిని విక్రయించినా, రవాణా చేసినా సమాచారం అందించాలన్నారు. గ్రామంలో ఎలాంటి సమస్యలు ఉన్నా పోలీసులకు తెలపాలని పేర్కొన్నారు. అందరూ రోడ్డు భద్రత నియమాలు పాటించాలని తెలిపారు. ఇందులో రూరల్ సీఐ కృష్ణ, ఎస్సైలు శ్రీకాంత్, లింబాద్రి, గణేశ్, పోలీలు పాల్గొన్నారు.
నిర్మల్ పట్టణంలో నేరాల నియంత్రణ, నిందితుల గుర్తింపులో కీలకంగా పనిచేయాల్సిన సీసీ కెమెరాల నిర్వహణ బలహీనపడింది. ప్రధాన కూడళ్లలో పోలీస్ శాఖ ఏర్పాటు చేసిన కెమెరాలకు సంబంధించిన వైర్లు దెబ్బతినడం, సాంకేతిక సమస్యలు తలెత్తడంతో పలుచోట్ల పనిచేయడం లేదు. కొన్ని కూడళ్లలో కెమెరాలు పనిచేస్తున్నా.. మరికొన్ని కీలక ప్రాంతాల్లో పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది.
ప్రధాన కూడళ్లపై నిఘా కరువు
పట్టణంలో నిత్యం రద్దీగా ఉండే ప్రధాన కూడళ్లలో సీసీ కెమెరాల నిఘా కొరవడింది. ముఖ్యంగా శివాజీ చౌక్, ఈద్గా చౌరస్తా, జయశంకర్ చౌరస్తా, శాంతినగర్ చౌరస్తా, మంజులాపూర్ చౌరస్తా, మినీ ట్యాంక్ బండ్ వద్ద ఉన్న చౌరస్తాలు ప్రధాన కూడళ్లు. ఈ చౌరస్తాల్లో సీసీ కెమెరాలు ఉన్నప్పటికీ, ఒకటి రెండు చోట్ల మాత్రమే పనితీరు బాగుంది. మిగతా చౌరస్తాల్లో సరిగా పనిచేయడం లేదు. వాటి మరమ్మతులకు కూడా ఆలస్యం అవుతోంది. దీంతో నేరగాళ్లకు అవకాశం కలుగుతోంది. దొంగతనాలకు పాల్పడిన తర్వాత నిందితులు ఏ మార్గంలో వెళ్లారు, వారి వాహనం నంబర్ ఏమిటి అనే విషయాలను గుర్తించేందుకు సీసీ కెమెరా ఫుటేజీ కీలకం. అయితే కెమెరాలు పనిచేయకపోవడంతో దర్యాప్తు సమయంలో పోలీసులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
పెరుగుతున్న చోరీలు..
‘‘ఒక్క కెమెరా వంద మంది పోలీసులతో సమానం’’ అని పోలీస్ అధికారులు తరచూ చెబుతుంటారు. వాస్తవానికి దొంగతనాలు, దాడులు లేదా ఇతర నేరాలు జరిగినప్పుడు నిందితుల గుర్తింపులో సీసీ కెమెరాలే కీలకం. దీంతో దొంగలు చోరీలకు పాల్పడి సులభంగా పట్టణం దాటిపోతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కెమెరాలు పనిచేయడం లేదనే విషయం నేరగాళ్లకు తెలిసిపోతే పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది. దీంతో చోరీలు జరిగిన తర్వాత నిందితుల కదలికలను గుర్తించడం పోలీసులకు సవాలుగా మారుతోంది.
నిర్మల్ పట్టణంలోని ప్రధాన రహదారిపై పనిచేయని నిఘా నేత్రాలు..
‘ఒక్క సీసీ కెమెరా వంద మంది పోలీసులతో సమానం. ప్రతీ గ్రామంలో సీసీ కెమెరాలు ఉండాలి. సీసీ కెమెరాల ఏర్పాటుకు దాతలు మందుకు రావాలి. వ్యాపారులు, సంపన్నులు తమ ఇంటి ఆవరణలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి. సీసీ కెమెరాలతో నేరాలు తగ్గుతాయి. నేరం చేసినవారిని పట్టుకోవడం సులభం అవుతుంది..’ ఇవీ పోలీసులు ప్రజలకు చెప్పే మాటలు. కానీ ఇప్పటికే ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు పనిచేయకపోయినా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. ఇదే నిర్లక్ష్యం దొంగలకు అనుకూలంగా మారింది. దొంగతనాలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. అయినా నిఘా నేత్రాలను సరిచేసేలా ఎవరూ చర్యలు తీసుకోవడం లేదు. దీంతో నేరం చేసినవారిని గుర్తించడం, పట్టుకోవడం పోలీసులకు సవాల్‌గా మారుతోంది. – నిర్మల్‌టౌన్
27న ఉద్యోగుల మహా ధర్నా
నిర్మల్ రూరల్: ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల పెండింగ్ బకాయిలు విడుదల చేయాలని కోరుతూ ఈనెల 27న జిల్లా కేంద్రంలో మహాధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఎస్టీయూ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు భూమన్నయాదవ్, లక్ష్మణ్ తెలిపారు. జిల్లా కేంద్రంలో ఆదివారం మాట్లాడారు. ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ఐక్య ఉద్యమమే మార్గమన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలని డిమాండ్ చేశారు. పీఆర్సీ ఏర్పాటు చేసి ఫిట్‌మెంట్ ప్రకటించాలని, పెండింగ్ కరువు భత్యం విడుదల చేయాలని కోరా రు. పెండింగ్‌లో ఉన్న జీపీఎఫ్, సరెండర్ లీవ్, మెడికల్ రీయింబర్స్‌మెంట్ తదితర బిల్లులు చెల్లించాలన్నారు. న్యాయమైన డిమాండ్లు పరిష్కారమయ్యే వరకు ఉపాధ్యాయ సంఘాలు ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు.
మరమ్మతులు అంతంతే..
పట్టణంలోని అన్ని ప్రధాన కూడళ్లలో సీసీ కెమెరాల పనితీరును అధికారులు సమీక్షించి, ఎక్కడెక్కడ కెమెరాలు పనిచేయడం లేదో గుర్తించాల్సిన అవసరం ఉంది. దెబ్బతిన్న వైర్లు, విద్యుత్, నెట్‌వర్క్, కెమెరాల సాంకేతిక సమస్యలను వెంటనే పరిష్కరించడంతో పాటు 24 గంటల పర్యవేక్షణ ఉండేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.


