పర్యావరణాన్ని పరిరక్షించాలి | - | Sakshi
Sakshi News home page

పర్యావరణాన్ని పరిరక్షించాలి

Aug 24 2026 7:21 AM | Updated on Aug 24 2026 7:21 AM

● జిల్లా సైన్స్‌ అధికారి వినోద్‌ కుమార్‌

నిర్మల్‌ రూరల్‌: పర్యావరణ పరిరక్షణకు విద్యార్థులు కృషి చేయాలని జిల్లా సైన్స్‌ అధికారి వినోద్‌కుమార్‌ అన్నారు. జిల్లా కేంద్రంలోని ఆదర్శనగర్‌ శిశు మందిర్‌లో ఆదిలాబాద్‌, నిర్మల్‌ జిల్లాల శిశు మందిర్‌ విద్యార్థుల ఆదివారం మ్యాథ్స్‌ ఫెయిర్‌ నిర్వహించారు. కార్యక్రమానికి వినోద్‌కుమార్‌ హాజరై ప్రదర్శనను తిలకించారు. వ్యర్థ పదార్థాల నిర్వహణ, నిత్యజీవితంలో ఘర్షణ, ప్రత్యామ్నాయ శక్తి వనరులు, గణితంలో చతుర్విద ప్రక్రియలు తదితర అంశాలను విద్యార్థులు ప్రదర్శించారు. పర్యావరణాన్ని రక్షించడానికి మట్టితో విగ్రహాల తయారు చేశారు. అనంతరం విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ప్రథమ స్థానంలో నిలిచిన విద్యార్థులు ఈనెల 30, 31 సెప్టెంబర్‌ 1 తేదీల్లో ముధోల్‌లో జరిగే రాష్ట్రస్థాయిలో ప్రదర్శనలో పాల్గొంటారని నిర్వాహకులు తెలిపారు. శిశు మందిర్‌ విభాగ కార్యదర్శి దామోదర్‌ పురస్తు, గోపాల్‌ కిషన్‌, బజరంగ్లాల్‌, మనోహర్‌రెడ్డి న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు. పెంట అశోక్‌, శశిరాజ్‌, సుదర్శన్‌, వేణుమాధవ్‌, సోలాపూర్‌ రాజేశ్వర్‌, కొండూరు నరేశ్‌, పుష్పలత పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement