జిల్లా లక్ష్యం 900 విద్యార్థులను ప్రోత్సహించడంలో వెనుకబాటు సెప్టెంబర్‌లో పెరుగుతాయంటున్న అధికారులు
లక్ష్మణచాంద: పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులను శాస్త్ర, సాంకేతిక రంగాలవైపు మళ్లించి, వారిలో దాగిఉన్న ప్రతిభను వెలుగులోకి తీసేందుకు కేంద్ర ప్రభుత్వం ఏటా ఇన్‌స్పైర్ మానక్ కార్యక్రమం నిర్వహిస్తోంది. 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించిన నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైంది. దరఖాస్తులు స్వీకరించడం మొదలై నెలన్నర రోజులు గడిచినా జిల్లాలో స్పందన అంతంత మాత్రంగానే ఉంది.
సెప్టెంబర్ 15 వరకు గడువు..
జూలైలో ప్రారంభమైన దరఖాస్తు ప్రక్రియలో భాగంగా ఇప్పటి వరకు 20 దరఖాస్తులు మాత్రమే వచ్చాయని జిల్లా విద్యాశాఖ అధికారులు తెలిపారు. సెప్టెంబర్‌లో ఎక్కువ మంది విద్యార్థులు ముందుకు వస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు, గురుకుల, కేజీబీవీ, ఆదర్శ పాఠశాలల్లో 6 నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చు.
ప్రోత్సాహకాలు ఇస్తున్నా..
ఇన్‌స్పైర్ మానక్‌లో పాల్గొనే విద్యార్థులు ప్ర స్తుతం సమాజంలో ఉన్న సమస్యలకు పరిష్కా రం కనుగొనేలా ఆవిష్కరణలు తయారు చేస్తే, జిల్లాస్థాయిలో ఎంపికై నవారికి రూ.10 వేలు, రా ష్ట్ర స్థాయికి ఎంపికై తే రూ.20 వేల ప్రోత్సాహకంగా అందజేస్తారు. అయినా ఇప్పటి వరకు జిల్లాలో కేవలం 20 దరఖాస్తులు వచ్చాయి. సైన్స్ ఉపాధ్యాయుల విద్యార్థులను ప్రోత్సహించడంలో వెనుకబడుతున్నారన్న చర్చ జరుగుతోంది.
ప్రతీ పాఠశాల నుంచి ఐదు..
జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు, కేజీబీవీలు, గురుకులాలు, ఆదర్శ పాఠశాలలు కలిపి మొత్తం 1,02 2 ఉన్నాయి. వీటిలో 1,29,990 మంది విద్యార్థులు చదువుతున్నారు. ప్రతీ పాఠశాల నుంచి గరి ష్టంగా ఐదు నామినేషన్లకు అవకాశం ఉందని అధికారులు తెలిపారు. 2026–27 సంవత్సరానికి జిల్లా స్థాయిలో 900 నామినేషన్లు లక్ష్యంగా పెట్టుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
మండలానికి ముగ్గురు ఇన్‌చార్జీలు
నిర్దేశించుకున్న లక్ష్యాన్ని చేరుకోవడానికి ప్రతీ మండలానికి ముగ్గురు ఉపాధ్యాయులను ఇన్‌చార్జీలుగా నియమించినట్లు జిల్లా సైన్స్ అధికారి వినోద్‌కుమార్ తెలిపారు. వీరు ప్రతీ పాఠశాల నుంచి ఎక్కువ మంది విద్యార్థులు తమ ఆవిష్కరణలు తయారు చేసేలా చూస్తారు. సెప్టెంబర్ మొదటి వారం నుంచి వారు బాధ్యతలు స్వీకరించి, లక్ష్య సాధనకు అవసరమైన చర్యలు చేపట్టనున్నారు.
లక్ష్యం చేరేందుకు చర్యలు..
అవగాహన లేమితో విద్యార్థులు తమ ప్రతిభను బయటకు ప్రదర్శించలేకపోతున్నారు. ఇన్‌చార్జీలు, ప్రధానోపాధ్యాయుల ద్వారా విద్యార్థులకు అవగాహన కల్పిస్తాం. సెప్టెంబర్ 15 వరకు జిల్లాకు నిర్దేశించిన లక్ష్యం చేరేందుకు చర్యలు తీసుకుంటాం.
– వినోద్‌కుమార్, జిల్లా సైన్స్ అధికారి
జిల్లా సమాచారం....
మొత్తం పాఠశాలలు 1,022
మొత్తం విద్యార్థులు 1,29,990
ప్రాజెక్టుల జిల్లా లక్ష్యం 900
ఇప్పటి వరకు వచ్చినవి 20


