వరుణుడి జాడేది? | - | Sakshi
Sakshi News home page

వరుణుడి జాడేది?

Aug 16 2026 11:35 PM | Updated on Aug 16 2026 11:35 PM

● వారంరోజులుగా కురవని వర్షం ● పెరుగుతున్న పగటి ఉష్ణోగ్రతలు ● పంటలకు తప్పని తెగుళ్ల బెడద ● నీటి యాజమాన్యం తప్పనిసరి సోమవారం శ్రీ 17 శ్రీ ఆగస్టు శ్రీ 2026

న్యూస్‌రీల్‌

ప్రైవేట్‌ పాఠశాలలకు విద్యాశాఖ ముక్కుతాడు నోటీస్‌ బోర్డులపై వివరాలు పెట్టాల్సిందే.. వెబ్‌సైట్‌లో సమగ్ర వివరాలు తప్పనిసరి.. నిబంధనలు పాటించకుంటే షోకాజ్‌ నోటీసులు యాజమాన్యాలకు విద్యాశాఖ డైరెక్టర్‌ ఆదేశాలు

నిర్మల్‌

ప్రకృతి ఒడిలో వీకెండ్‌

ఉమ్మడి జిల్లాలోని కుంటాల జలపాతం, కడెం జలాశయం పర్యాటకులను ఆహ్వానిస్తున్నాయి. వీకెండ్‌లో వస్తున్న సందర్శకులకు మానసికోల్లాసాన్ని పంచుతున్నాయి.

అటల్‌ జీ సేవలు చిరస్మరణీయం

నిర్మల్‌చైన్‌గేట్‌: జిల్లా కేంద్రంలోని బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి క్యాంపు కా ర్యాలయంలో ఆదివారం భారతరత్న, మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయి వర్ధంతిని ని ర్వహించారు. ఈ సందర్భంగా అటల్‌ జీ చిత్రపటానికి మహేశ్వర్‌రెడ్డి పూలమాల వేసి నివా ళులర్పించారు. ఆయన దేశానికి చేసిన సేవల ను కొనియాడారు. కార్యక్రమంలో బీజేపీ నా యకులు రావుల రాంనాథ్‌, తక్కల రమణారె డ్డి, ముత్యంరెడ్డి, సత్యం చంద్రకాంత్‌, కందుల హరీశ్‌, శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

భైంసా: వరుణుడు ముఖం చాటేశాడు. జిల్లాలో వారంరోజులుగా ఒక్క వర్షం కురవలేదు. దీంతో పంట పొలాల్లో తేమ తగ్గుతోంది. పగటివేళ ఎండ తీవ్రతా అధికంగా ఉంది. ఇప్పటివరకు ఏపుగా పెరిగిన వరి, సోయా, పత్తి తదితర పంటల్లో ఎదుగుదల తగ్గి తెగుళ్లు, పురుగులు ఉధృతమయ్యే అవకాశముంది. వరి పొలాల్లో ఆకులు, కాండం, దుబ్బులను రైతులు నిత్యం పరిశీలించాలి. పంటలో ఏదైనా మార్పు కనిపించినా, పురుగులు లేదా తెగుళ్ల లక్షణాలు గుర్తించినా వెంటనే వ్యవసాయశాఖ అధికారులను సంప్రదించాలి. వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటకు అవసరమైన నీటి యాజమాన్యం చేపట్టాలి.

4.1 శాతం లోటు వర్షపాతం

జూన్‌ 1నుంచి ఆగస్టు 15వరకు జిల్లాలో సాధారణ వర్షపాతం 601.7 మి.మీ. కాగా, ఇప్పటివరకు 577.1 మి.మీ. వర్షపాతం మాత్రమే నమోదైంది. దీంతో జిల్లా సగటు వర్షపాతం 4.1 శాతం లోటులో ఉంది. ఆగస్టు 15న జిల్లాలో సగటున కేవలం 0.2 మి.మీ. వర్షపాతం నమోదైంది. మండలాల వారీగా కుభీర్‌, తానూర్‌, బాసరలో సాధారణం కంటే త క్కువ వర్షపాతం నమోదై లోటు కొనసాగుతోంది.

కొన్ని మండలాల్లో అధికం

జిల్లాలోని కొన్ని మండలాల్లో సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదైంది. పెంబిలో 792.9 మి.మీ., కడెం పెద్దూరులో 792.2 మి.మీ., నిర్మల్‌ అర్బన్‌లో 758.6 మి.మీ. వర్షపాతం నమోదైంది. అయితే, మండలాల వారీగా వర్షపాతం అసమానంగా ఉండటంతో పలు ప్రాంతాల్లో పంటలకు తేమ కొరత ఏర్పడే పరిస్థితి కనిపిస్తోంది.

కళాకారుల కార్యవర్గం

నిర్మల్‌టౌన్‌: చలనచిత్ర టీవీ కళాకారుల అసో సియేషన్‌ జిల్లా కార్యవర్గాన్ని ఆదివారం జిల్లా కేంద్రంలోని టీఎన్జీవోస్‌ భవనంలో ఎన్నుకున్నారు. అసోసియేషన్‌ వ్యవస్థాపకుడు అడిచర్ల రాజు, టీఎన్జీవోస్‌ అధ్యక్షుడు వెల్మల ప్రభాకర్‌ ఆధ్వర్యంలో ఎన్నికలు నిర్వహించారు. అసోసి యేషన్‌ అధ్యక్షుడుగా కోటగిరి నర్సయ్యచారి, ప్రధాన కార్యదర్శిగా తిరుక్కోవేల రవి, కోశాధికారిగా సామెర్ల రాజన్న, ఉపాధ్యక్షులుగా చెట్పేల్లి కమలాకర్‌, చిత్తూరి మేరీమాత, సంయుక్త కార్యదర్శులుగా రామేల్లి హరీశ్‌బాబు, ధనాలకోట కృష్ణవర్మ, ప్రచార కార్యదర్శిగా గర్దాసు సురేందర్‌, ముఖ్య సలహాదారులుగా పడాల మోహన్‌రావు, బొందిడి పురుషోత్తమరావు, ముప్పిడి సూర్యనారాయణ, జన్ను అనిల్‌కుమార్‌, తాడూరి రాజేందర్‌ ఎన్నికయ్యారు.

మండలం కురవాల్సిన కురిసిన

వర్షపాతం వర్షపాతం

(మి.మీ.) (మి.మీ.)

కుభీర్‌ 600.3 428.8

తానూర్‌ 569.6 385.0

బాసర 584.4 461.5

ముధోల్‌ 590.8 486.1

భైంసా 601.0 530.0

కుంటాల 607.4 516.0

నర్సాపూర్‌(జి) 600.4 522.8

లోకేశ్వరం 547.2 534.8

దిలావర్‌పూర్‌ 640.3 604.5

సారంగపూర్‌ 618.3 541.1

నిర్మల్‌ అర్బన్‌ 643.1 758.6

నిర్మల్‌ రూరల్‌ 607.3 546.7

సోన్‌ 595.6 598.4

లక్ష్మణచాంద 577.7 558.2

మామడ 555.4 637.5

పెంబి 616.5 792.9

ఖానాపూర్‌ 610.3 620.1

కడెం పెద్దూర్‌ 643.5 792.2

దస్తూరాబాద్‌ 622.4 649.2

తేమ తగ్గకుండా చూసుకోవాలి

వర్షాలు లేకపోగా ఎండ తీవ్రత పెరిగింది. వాతావరణంలో మార్పుల కారణంగా వరికి అగ్గి తెగులు, కాండం తొలిచే పురుగు తదితర తెగుళ్లు, పురుగులు ఆశించే అవకాశముంది. రైతులు పంటలను నిత్యం పరిశీలిస్తూ తెగుళ్ల లక్షణాలు కనిపించిన వెంటనే వ్యవసాయ అధికారులను సంప్రదించాలి. సొంతంగా మందులు పిచికారీ చేయకుండా అధికారుల సూచనల మేరకు సరైన మోతాదులో మందులు వినియోగించాలి. పంటకు అవసరమైన మేరకు నీటి యాజమాన్యం చేపట్టి తేమ తగ్గకుండా చూసుకోవాలి.

– గణేశ్‌, భైంసా వ్యవసాయాధికారి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement