నిర్మల్‌టౌన్: సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ జయంతి వారోత్సవాలను ఈ నెల 18నుంచి 25వరకు గ్రామగ్రామాన ఘనంగా నిర్వహించాలని తెలంగాణ గౌడ సంఘాల జేఏసీ రాష్ట్ర చైర్మనన్ అమరవేణి నర్సాగౌడ్ పిలుపునిచ్చారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని సంఘం కార్యాలయంలో ఆయన మాట్లాడారు. పాపన్నగౌడ్ విగ్రహాలున్నచోట వాటి వద్ద, లేని ప్రాంతాల్లో చిత్రపటాలు ఏర్పాటు చేసి వేడుకలు నిర్వహించాలని కోరారు. బడుగు, బలహీన వర్గాలను కార్యక్రమాల్లో భాగస్వాములను చేయాలని సూచించారు. రాచరిక, భూస్వామ్య వ్యవస్థలకు వ్యతిరేకంగా పాపన్నగౌడ్ పోరాడారని కొనియాడారు. ఈ నెల 18లోపు జనగామ జిల్లాకు సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ పేరు పెట్టేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. స్పందించకుంటే రాష్ట్రవ్యాప్తంగా దశలవారీ ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. నాయకులు రాగుల సిద్ధిరాములుగౌడ్, ఏవీ బాలేశంగౌడ్, బాలసాని సురేశ్‌గౌడ్, కేసరి ఆంజనేయులుగౌడ్, రాగుల కిరణ్‌కుమార్‌గౌడ్, కదిరె ఆంజనేయులుగౌడ్, కొండ్ర మనోహర్‌గౌడ్ తదితరులున్నారు.


