నిర్మల్‌ఖిల్లా/ఖానాపూర్/మామడ: బోధనలో సరికొత్త మెలకువలు, ఆ ధునిక విద్యా విధానాలు, పాఠశాల నిర్వహణలో జపాన్ అనుసరిస్తున్న ఉ త్తమ పద్ధతులను ప్రత్యక్షంగా తెలు సుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం, పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో చేపట్టిన ఆ దేశ పర్యటనకు జిల్లా నుంచి న లుగురు ఉపాధ్యాయులు ఎంపిక య్యారు. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ డాక్టర్ నవీన్ నికోలస్ ఉత్తర్వులు జారీ చేసి ఈ విషయాన్ని పేర్కొన్నారు. విద్యార్థుల్లో అ భ్యసన సామర్థ్యాలను పెంపొందించే వినూత్న బో ధనా పద్ధతులు, విద్యార్థుల ఎన్‌రోల్‌మెంట్ పెంపు, పాఠశాలల అభివృద్ధికి చేస్తున్న కృషి, ఉత్తమ పద్ధతుల అమలు తదితర అంశాలను పరిగణనలోకి తీ సుకుని ఉపాధ్యాయులను ఎంపిక చేసినట్లు తెలిపా రు. ఖానాపూర్ మండలంలోని మస్కాపూర్ పీఎంశ్రీ జెడ్పీహెచ్‌ఎస్ ప్రధానోపాధ్యాయుడు జాడి శ్రీనివాస్, నిర్మల్ మండలంలోని మంజులాపూర్ జిల్లా పరి షత్ సెకండరీ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సిద్ద పద్మ, బైంసా ప ట్టణంలోని మదీనా కాలనీ ప్రభుత్వ పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్‌గా వి ధులు నిర్వహిస్తున్న ఫరీదా తస్నిమ్, మామడ మండలంలోని దిమ్మదుర్తి ప్రాథమికోన్నత పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న ఎన్.వనజ జపాన్ పర్యటనకు ఎంపికై నవారిలో ఉన్నారు. ఎంపికైన ఉపాధ్యాయులు సంబంధిత అధికారుల నుంచి ఎన్వోసీ పొందాల్సి ఉంటుంది. వీసా ప్రక్రియ, ఇతర సూచనల కోసం అధికారులు ఈ నెల 18న మధ్యాహ్నం 2గంటలకు అధికారులు వర్చువల్ ఓరియంటేషన్ నిర్వహించనున్నారు. వీరు సెప్టెంబర్ 5నుంచి 12వ తేదీ వరకు జపాన్‌లో పర్యటించనున్నారు.


