ఎమ్మార్సీ, సీఆర్పీలకు నిర్వహణ నిధులు | - | Sakshi
Sakshi News home page

ఎమ్మార్సీ, సీఆర్పీలకు నిర్వహణ నిధులు

Aug 16 2026 11:35 PM | Updated on Aug 16 2026 11:35 PM

● జిల్లాకు రూ.37.74లక్షలు మంజూరు ● ఉత్తర్వులు జారీ చేసిన విద్యాశాఖ

లక్ష్మణచాంద: సమగ్ర శిక్షా అభియాన్‌ ఆధ్వర్యంలో మండల విద్యావనరుల కేంద్రాలు, స్కూల్‌ కాంప్లెక్స్‌లను సజావుగా నిర్వహించేందుకు 2026–27 విద్యాసంవత్సరానికి తెలంగాణ ప్ర భుత్వం నిధులు విడుదల చేసింది. ఈ మేరకు పాఠశాల డైరెక్టర్‌ నవీన్‌ నికోలస్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ఉపాధ్యాయులకు వివిధ అంశాలపై శిక్షణ తరగతులు, సమావేశాలను ఎమ్మార్సీలు, స్కూల్‌ కాంప్లెక్స్‌లలోనే నిర్వహిస్తుంటారు. అయితే, ప్రభుత్వం సకాలంలో నిర్వహణ నిధులు మంజూరు చేయకపోవడంతో ఇప్పటివరకు మండల విద్యాధికారులు, క్లస్టర్‌ ప్రధానోపాధ్యాయులే వెచ్చించేవారు.

మంజూరైన నిధులు ఇలా..

జిల్లాలో 19 మండలాల పరిధిలో 19 ఎమ్మార్సీ లు, 48 స్కూల్‌ కాంప్లెక్స్‌లున్నాయి. ఒక్కో ఎ మ్మార్సీ నిర్వహణకు రూ.90వేల చొప్పున.. మొ త్తం రూ.17.10లక్షలు మంజూరు చేశారు. ఒ క్కో స్కూల్‌ కాంప్లెక్స్‌ నిర్వహణకు రూ.43వేల చొప్పున.. మొత్తం రూ.20.64లక్షలు మంజూరైనట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు. ఈ నిధులు విడతల వారీగా కాకుండా 100 శాతం ఒకేసారి మంజూరైనట్లు పేర్కొన్నారు.

ఖర్చు చేయాలి ఇలా..

ఎమ్మార్సీలకు మంజూరైన నిధుల నుంచి బోధ న, అభ్యసన సామగ్రి కోసం రూ.20వేలు, కాంటింజెంట్‌ గ్రాంట్‌ (స్టేషనరీ, నెట్‌ చార్జీలు) కో సం రూ.25వేలు, కార్యక్రమాల నిర్వహణకు రూ.25వేలు, విద్యుత్‌ చార్జీలు, మూత్రశాలల నిర్వహణ, ఇతర పనుల కోసం రూ.20వేలు ఖర్చు చేయాలని విద్యాశాఖ సూచించింది. స్కూల్‌ కాంప్లెక్స్‌ నిధుల్లో అత్యవసర ఖర్చుల కోసం రూ.10వేలు (మొబైల్‌ రీచార్జీలు, రికా ర్డుల కొనుగోలు), క్లస్టర్‌ స్థాయి సమావేశాలకు రూ.3వేలు, మరమ్మతులు, స్టేషనరీ కోసం రూ.20వేలు, టీఎల్‌ఎం ఖర్చులు, పత్రికలు, టీఎల్‌ఎం తయారీ కోసం రూ.10వేలు వినియోగించాలని అధికారులు సూచించారు.

నిబంధనల మేరకు ఖర్చు చేయాలి

సమగ్ర శిక్షా అభియాన్‌ ఆ ధ్వర్యంలో మంజూరైన ని ధులను రాష్ట్ర పాఠశాల వి ద్యాశాఖ సూచనల మేరకు ఖర్చు చేయాలి. ఎంఈవోలు, స్కూల్‌ కాంప్లెక్స్‌ ప్రధానోపాధ్యాయులు వివిధ ఉపాధ్యాయుల శిక్షణ కార్యక్రమాల నిర్వహణకు, బోధన అభ్యసన సామగ్రి కొనుగోలు కోసం వినియోగించి విద్యార్థుల అభివృద్ధికి చర్యలు చేపట్టాలి.

– భోజన్న, జిల్లా విద్యాధికారి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement