ఎస్సారెస్పీకి తగ్గిన ఇన్‌ఫ్లో | - | Sakshi
Sakshi News home page

ఎస్సారెస్పీకి తగ్గిన ఇన్‌ఫ్లో

Aug 16 2026 11:35 PM | Updated on Aug 16 2026 11:35 PM

భైంసా: మహారాష్ట్రలో వారం రోజులుగా భారీ వర్షాలు కురవకపోవడంతో ఎస్సారెస్పీకి వస్తు న్న వరద గణనీయంగా తగ్గింది. ప్రస్తుతం ప్రా జెక్ట్‌కు 1,013 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా ఇదే స్థాయిలో దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్ట్‌ పూర్తి స్థాయి నీటిమట్టం 1,091 అడుగులు కాగా, ఆదివారం మధ్యాహ్నం 3గంటల వ రకు 1,079.60 అడుగులుగా ఉంది. కాకతీయ కాలువ ద్వారా 300 క్యూసెక్కులు, మిషన్‌ భగీరథ ద్వారా 231 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్ట్‌ గరిష్ట నిల్వ సామర్థ్యం 80.5 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 43.967 టీఎంసీల నీరుంది. ఆవిరి రూపంలో సుమారు 482 క్యూసెక్కుల నీటి నష్టం నమోదవుతోంది. ప్రస్తుతం స్పిల్‌వే గేట్లు, ఎస్కేప్‌ గేట్లు, ఫ్లడ్‌ ఫ్లో కెనాల్‌ ద్వారా ఎలాంటి నీటి విడుదల లేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement