గూడేల్లో కానరాని సౌకర్యాలు
తాగునీటికి ఇప్పటికీ తిప్పలే
విద్య, వైద్యపరంగానూ వెనుకబాటే
హక్కుల కోసం ఆగని పోరాటం
నేడు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం
ఉమ్మడి జిల్లాలో..
ఐటీడీఏ పరిధిలోని మండలాలు 77
ఆదివాసీ గిరిజన కుటుంబాలు 67,648
ఆదివాసీ గిరిజన జనాభా 4,84,790
గుక్కెడు నీటికి తిప్పలే..
వేసవి వచ్చిందంటే చాలు ఆదివాసీలు ఏటా తాగునీటికి అవస్థలు పడాల్సి వస్తోంది. ఇంటింటికీ శుద్ధజలం అందిస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ ఆచరణలో కానరాని పరిస్థితి. గుక్కెడు నీటికోసం నెత్తిన బిందెలతో కిలోమీటర్ల దూరం వెళ్లాల్సిన దుస్థితి. చేదబావుల వద్ద గంటల తరబడి నిరీక్షణ తప్పడం లేదని చెలిమనీటితో గొంతు తడుపుకోవాల్సి వస్తోందని అడవిబిడ్డలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గూడు గోడు పట్టించుకోవట్లేదు..
ఆదివాసీలు ఏళ్లుగా అనేక సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికీ అటవీ ఉత్పత్తులు, పోడు వ్యవసాయం చేసుకుంటూ పూరి గుడిసెల్లో నివాసముంటున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇళ్ల నిర్మాణాల కోసం నిధులు మంజూరు చేసినా అటవీశాఖ అభ్యంతరంతో గూడు నిర్మాణానికి దూరమవుతున్న పరిస్థితి. ఇలాగైతే ఆదివాసీల అభివృద్ధి ఎలా సాధ్యపడుతుంది. – కుమ్ర రాజు, ఆదిమ
గిరిజన కొలాం సేవా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు
సంక్షేమ ఫలాలు అందట్లేదు
ఆదివాసీల అభివృద్ధికి ప్రత్యేకంగా ఐటీడీఏ ఉన్నా సంక్షేమ ఫలాలు అందని ద్రాక్షగా మారాయి. ఏటా ఆదివాసీ దినోత్సవం సందర్భంగా పాలకులు హామీలు ఇస్తున్నా అమలుకు నోచుకోవడం లేదు. ఇప్పటికీ అనేక గ్రామాలకు రోడ్డు లేదు. తాగునీటికి తిప్పలు తప్పట్లేదు. విద్య, వైద్యం కూడా అంతంతే. చిన్న పిల్లలు రక్త హీనతతో బాధపడుతున్నారు. – మెస్రం శంకర్,
ఆదివాసీ సంఘం రాష్ట్ర నాయకుడు
ఆదిలాబాద్‌రూరల్ మండలంలోని వాన్‌వాట్ పంచాయతీ పరిధిలోని మంగ్లీ గ్రామానికి వెళ్లే రోడ్డు దుస్థితి ఇదీ. ఇక్కడ సుమారు 20 ఆదివాసీ కుటుంబాలు నివసిస్తున్నాయి. 100 వరకు జనాభా ఉంటుంది. ఈ ఊరుకు రోడ్డు సౌకర్యం లేకపోవడంతో అత్యవసర సమయంలో 108 వాహనం కూడా వచ్చే పరిస్థితి కూడా లేదని గ్రామస్తులు పేర్కొంటున్నారు. పాలకులు మారుతున్నా తమ తలరాత మారడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
‘మెనూ పాటించని వార్డెన్లపై చర్య తీసుకోవాలి’
నిర్మల్‌టౌన్: జిల్లాలోని ప్రభుత్వ వసతి గృహాల్లో విద్యార్థులకు నాణ్యమైన భోజనం, రక్షిత మంచినీరు అందించాలని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కన్వీనర్ దిగంబర్ డిమాండ్ చేశారు. మెనూ పాటించని వార్డెన్లపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. జిల్లా కేంద్రంలోని ఎస్‌ఎఫ్‌ఐ కార్యాలయంలో శనివారం మాట్లాడారు. వసతి గహాల్లోని సమస్యలు తెలుసుకునేందుకు కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలన్నారు. కొన్ని హాస్టళ్లలో ఆర్వో ప్లాంట్లు ఉన్నా వినియోగించకుండా కలుషిత నీటిని అందిస్తున్నారని ఆరోపించారు. తనిఖీలు చిత్తశుద్ధితో నిర్వహించి విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఐటీడీఏ పరిధిలోని 170కిపైగా గిరిజన గూడేలకు ఇప్పటికీ విద్య, వైద్యం, రోడ్లు, తాగునీరు వంటి కనీస సౌకర్యాలు కరువయ్యాయి. వర్షాకాలం వచ్చిందంటే నిత్యం అవస్థలే. వంతెనలు లేక వాగులు, వంకలు పొంగిన క్రమంలో రోజుల తరబడి ఆదివాసీలు బాహ్య ప్రపంచానికి దూరంగా ఉండాల్సిందే. విధిలేని పరిస్థితుల్లో వాగులు దాటుతూ ప్రమాదాల బారిన పడుతున్న వారెందరో. 108, 102 వాహనాల సంగతి అటుంచితే చాలా గ్రామాలకు కాలినడకన కూ డా వెళ్లలేని దుస్థితి. అత్యవసర పరిస్థితుల్లో గర్భిణులు, రోగులను ఆసుపత్రికి తీసుకెళ్లాలంటే అవస్థలు వర్ణనాతీతమే. సుమారు 40కి పైగా ఆదివాసీ గామాల్లో ఇప్పటికీ కరెంట్ వసతి లేకపోవడం పాలకుల చిత్తశుద్ధికి నిదర్శనంగా నిలుస్తోంది.
చదవులోనూ వెనుకబాటే..
ఆదివాసీలకు విద్యాపరంగా వెనుకబాటు తప్పడం లేదు. గిరిజనులకు నాణ్యమైన విద్యనందించేందుకు ప్రభుత్వాలు ప్రతిపాదనలు చేస్తున్నప్పటికీ ఆచరణలో కార్యరూపం దాల్చడం లేదు. ఆశ్రమ పాఠశాలలు, గురుకులాల్లో ఏళ్లుగా ఉపాధ్యాయుల నియామకాలు లేక సీఆర్టీలతోనే కాలం వెల్లదీస్తున్నారు. ఉట్నూర్ కేంద్రంగా మంజూరైన గిరిజన యూనివర్సిటీ మరో చోటికి తరలించడంతో ఈ ప్రాంతానికి తీవ్ర అన్యాయం జరిగింది.
ఆర్‌ఓఎఫ్‌ఆర్ హక్కుల కోసం నిరీక్షణ..
జల్.. జంగల్..జమీన్ నినాదంతో సాగిన భూపోరాటం స్ఫూర్తిగా ఆదివాసీలు ఏళ్లుగా తమ హక్కుల సాధన కోసం ఉద్యమిస్తూనే ఉన్నారు. 1/70, పీసీ చట్టాల ప్రకారం ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనులకు భూములపై సర్వహక్కులు ఉంటాయి. ఆర్‌ఓఎఫ్‌ఆర్–2006 చట్టం ప్రకారం భూములు సాగు చేస్తున్న ఆదివాసీలకు పలుమార్లు హక్కుపత్రాలను ప్రభుత్వాలు అందించినప్పటికీ పూర్తి స్థాయిలో అందని పరిస్థితి. వాటికోసం ఇప్పటికీ పోరాడుతూనే ఉన్నారు. తమపై అటవీ అధికారుల వేధింపులు పెరిగాయని, గిరిజన ప్రాంతాల్లో గిరిజనేతరుల ఆధిపత్యం పెరుగుతుందని ఆదివాసీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. న్యాయం చేయాలంటూ ఆందోళనలు సైతం చేపడుతూనే ఉన్నారు.
అడవితల్లిని నమ్ముకుని ప్రకృతి ఒడిలో జీవించే ఆదివాసీలు ఏళ్లుగా సమస్యలతో సహవాసం చేస్తూనే ఉన్నారు. స్వాతంత్య్రం సిద్ధించి ఎనిమిది దశాబ్దాలు సమీపిస్తున్నా గిరిపుత్రుల బతుకుల్లో మాత్రం ఇంకా వెలుగులు కనిపించని పరిస్థితి. ఇప్పటికీ తాగునీటి కష్టాలు వెంటాడుతుండగా.. కరెంటు లేని గ్రామాలు సైతం అనేకం ఉన్నాయి. విద్య, వైద్యపరంగానూ వెనుకబాటే కనిపిస్తోంది. పాలకులు మారుతున్నా తమ బతుకులు మారడం లేదని..హక్కులు, అస్తిత్వం కోసం అడవిబిడ్డలు నిత్యం పోరుబాట పడుతూనే ఉన్నారు. నేడు అంతర్జాతీయ ఆదివాసీల దినోత్సవం సందర్భంగా ఉమ్మడి జిల్లాలోని ఆదివాసీల స్థితిగతులపై ప్రత్యేక కథనం. – కై లాస్‌నగర్/ఆదిలాబాద్‌రూరల్/ఉట్నూర్‌రూరల్
రేపు టీఎంయూ సమావేశం
నిర్మల్‌టౌన్: ఆర్టీసీ తెలంగాణ మజ్దూర్ యూని యన్(టీఎంయూ) ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా స్థాయి సమావేశం ఈనెల 10న ఆదిలాబాద్‌లో నిర్వహిస్తున్నట్లు యూనియన్ రీజియన్ కార్యదర్శి ఆర్.గంగాధర్ శనివారం తెలిపారు. ఈ సందర్భంగా టీఎంయూ కార్యాలయ ప్రారంభం, జెండా ఆవిష్కరణ అనంతరం యూని యన్ ఎన్నికల సమావేశం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఉమ్మడి జిల్లాలోని ఆదిలాబాద్, ఆసిఫాబాద్, ఉట్నూర్, మంచిర్యాల, నిర్మల్, భైంసా డిపోల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరు కావాలని కోరారు.
ఆదివాసీల అభ్యున్నతికి కృషి
ఆదివాసీల సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తుంది. ముఖ్యంగా పీవీటీజీ తెగలకు చెందినవారి అభ్యున్న తి, స్థితిగతులు, గూడెల్లో మౌలిక వసతులు మెరుగుపర్చేందుకు ప్రత్యేకంగా కృషి చేస్తుంది. ఉమ్మడి జిల్లాలో పకడ్బందీగా అమలయ్యేలా సమీక్షిస్తూ ఆదివాసీల సంక్షేమానికి ఎప్పటికప్పుడు తగు చర్యలు తీసుకుంటున్నాం.
– గోడం నగేశ్, ఎంపీ


