న్యూస్‌రీల్
సాగువిస్తీర్ణం, వేసే పంట ఆధారంగా ఎరువులు జిల్లాలో ఈ నెల 13 నుంచి అమలులోకి ఎఫ్‌ఎఫ్‌ఎస్ ఆన్‌లైన్‌లో బుక్ చేసుకుంటేనే డీలర్ల వద్ద సబ్సిడీ అన్నదాత అయోమయం
నిర్మల్
కదులుతున్న ‘కాంట్రాక్ట్’ డొంక
జూనియర్ లెక్చరర్ల క్రమబద్ధీకరణ (రెగ్యులరైజేషన్) ప్రక్రియలో అక్రమాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ముగ్గురికి నోటీసులు వచ్చాయి.
పీజీ ఎంట్రెన్స్‌లో ప్రతిభ
నిర్మల్‌ఖిల్లా: నిర్మల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బీఎస్సీ(ఎంపీసీ) చదివిన గుగ్లావత్ శేఖర్ ఇటీవల నిర్వహించిన సీపీజీఈటీ(కామన్ పోస్ట్‌గ్రాడ్యుయేట్ ఎంట్రన్స్ టెస్ట్)లో రసాయన శాస్త్రం విభాగంలో రాష్ట్రస్థాయి 5వ ర్యాంక్ సాధించాడు. హాస్టల్‌లో ఉంటూ చదువును కొనసాగించిన ఆయన, అందుబాటులో ఉన్న పరిమిత వనరులను సద్వినియోగం చేసుకుని ఉన్నత లక్ష్యాలవైపు అడుగులు వేశారు. శేఖర్‌ను కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఎం.సుధాకర్ అభినందించారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులు శేఖర్‌ను స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. రసాయన శాస్త్ర అధ్యాపకులు అర్చన, డా. సూర్యాసాగర్, రమేశ్‌రెడ్డి, ఇతర అధ్యాపకులు శుభాకాంక్షలు తెలిపారు.
నిర్మల్‌చైన్‌గేట్: జిల్లాలోని రైతులు ఇకపై యూరియాతోపాటు కాంప్లెక్స్ ఎరువులను కూడా ఆన్‌లైన్ యాప్ ద్వారానే కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఎరువుల పంపిణీలో అక్రమాలకు అడ్డుకట్ట వేస్తూ, రైతులకు వారి సాగు విస్తీర్ణం మేరకు అవసరమైన ఎరువులు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ఫార్మర్ ఫెర్టిలైజర్ యాఫ్‌ను తీసుకొచ్చింది. రాష్ట్రంలో ఇప్పటికే మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లో అమలవుతున్న ఈ పద్ధతిని మూడో విడతలో ఈ నెల 13 నుంచి జిల్లాలోనూ అమలు చేయనున్నారు. ఈ మేరకు వ్యవసాయ శాఖ సన్నాహాలు చేస్తోంది.
ఎఫ్‌ఎఫ్‌ఎస్ యాప్ ఏమిటి?
ఎఫ్‌ఎఫ్‌ఎస్(ఫ్రేమ్‌వర్క్ ఫర్ ఫెర్టిలైజర్ సేల్)అనేది ఎరువుల విక్రయాలు, నిల్వలు, డిమాండ్, సరఫ రాను సమర్థవంతంగా నిర్వహించేందుకు రూపొందించిన ప్రత్యేక డిజిటల్ వ్యవస్థ. రాయితీ ఎరువుల వినియోగాన్ని క్రమబద్ధీకరించి, అవసరం మేరకు నిర్ణయించిన మోతాదులో అందించడమే దీని ప్రధాన లక్ష్యం. ఈ విధానంలో రైతు సాగు చే స్తున్న పంట, విస్తీర్ణం ఆధారంగా ఎకరానికి నిర్దేశించిన పరిమితిలోనే రాయితీ ఎరువులనుఅందజేస్తారు.
డీలర్లకు శిక్షణ..
కొత్త ఎరువుల విధానంపై ఎరువుల డీలర్లకు జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లో జూమ్ ద్వారా శిక్షణనిచ్చారు. ఎరువులు ఫర్టిలైజర్ షాప్‌కు ఎలా వస్తాయి? యాప్‌లో రైతులు ఎలా బుకింగ్ చేసుకోవాలి? డీలర్లు రైతులకు ఏ విధంగా సరఫరా చేయాలి వంటి అంశాలపై అధికారులు అవగాహన కల్పించారు.
బుకింగ్ విధానం..
ముందుగా రైతులు తమ స్మార్ట్‌ఫోన్‌లో గూగుల్ ప్లేస్టోర్ నుంచి ఎఫ్‌ఎఫ్‌ఎస్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఇందులో తెలుగు భాషను ఎంచుకునే అవకాశం ఉంది. యాప్‌లో రైతులు తమ ఆధార్ నంబర్, మొబైల్ నంబర్, భూమి వివరాలు, సాగు చేస్తున్న పంట వివరాలను నమోదు చేయాలి. ఒకవేళ ఆన్‌లైన్‌లో భూమి వివరాలు కనిపించకుంటే, వాటిని స్వయంగా యాప్‌లో నమోదు చేసుకునే సౌకర్యం కూడా కల్పించారు. వివరాలన్నీ నమోదు చేసిన తర్వాత, అవసరమైన ఎరువు రకాన్ని ఎంపిక చేసుకోవాలి. ఏ డీలర్ వద్ద కొనుగోలు చేయాలనుకుంటున్నారో యాప్‌లోనే ఎంచుకుని బుకింగ్ పూర్తి చేయాలి. రైతులు బుక్ చేసిన వివరాలన్నీ నేరుగా ఆ డీలర్ వద్ద ఉన్న పీవోఎస్ యంత్రంలో కనిపిస్తాయి. వాటి ఆధారంగా డీలర్ రైతులకు రాయితీ ఎరువులు అందజేస్తారు.
రైతుల ఆందోళన
ఇప్పటికే యూరియా కోసం పడుతున్న కష్టాలు చాలవన్నట్లుగా, కొత్తగా దుక్కి మందులు, కాంప్లెక్స్ ఎరువులకు సైతం యాప్ తీసుకురావడం పట్ల రైతులు ఆందోళన చెందుతున్నారు. స్మార్ట్‌ఫోన్ లేని రైతులు, చదువురాని రైతులు ఇప్పటికే యూరియా బుకింగ్ కోసం ఇబ్బందులు పడుతుండగా, ఇక కొత్తగా అన్ని ఎరువులకు యాప్ బుకింగ్ పెట్టడం పట్ల రైతులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఎప్పటిలాగే ఎరువుల దుకాణాల ద్వారా ఎరువులు అందించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
అన్ని ఎరువులు యాప్‌లోనే..
ఇకపై అన్ని ఎరువులు కొత్తగా ఎఫ్‌ఎఫ్‌ఎస్ యాప్ ద్వారానే సరఫరా అవుతాయి. యూరియా తరహాలోనే అన్ని ఎరువులు యాప్‌లోనే రైతులు బుకింగ్ చేసుకుని సంబంధిత ఫర్టిలైజర్ షాప్ నుంచి తీసుకోవాలి. ఇప్పటికే ఫర్టిలైజర్ డీలర్లకు అవగాహన కల్పించాం. రైతులకూ ఇబ్బందులు కలుగకుండా చూస్తాం. – నాగరాజు, ఏవో


