కుంటాల: ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు సకాలంలో యూనిఫాం అందించాలని స్టేట్ సెర్ఫ్ డైరెక్టర్ సూర్యారావు పేర్కొన్నారు. మండలంలోని కల్లూరు, కుంటాల గ్రామాల్లో స్టిచ్చింగ్ హబ్‌లను మంగళవారం పరిశీలించారు. అర్హులైన వారికి పెన్షన్లు అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నూతన పెన్షన్ దరఖాస్తులను పరిశీలించి వారి సందేహాలు నివృత్తి చేశారు. ఆయన వెంట ఏపీడీ నాగవర్ధన్, సర్పంచులు జక్కుల గజేందర్, పెంటవార్ దశరథ్, ఉప సర్పంచ్ పరికిపండ్ల వెంకటరమణ, డీపీఎం చరణ్‌దాస్, ఎంపీడీవో గణపతివార్ వెంకటరాజు, ఏవో విక్రమ్, ఏపీఎం లక్ష్మణ్, డీఎంజీ పోశెట్టి, కార్యదర్శులు రాజబాపు, మాలతి ఉన్నారు.


