ప్రయోగాలకు నిధులు | - | Sakshi
Sakshi News home page

ప్రయోగాలకు నిధులు

Aug 9 2026 2:16 AM | Updated on Aug 9 2026 2:16 AM

● విద్యార్థుల సంఖ్య ఆధారంగా మంజూరు ● ఇంటర్‌ ప్రాక్టికల్స్‌కు బోర్డు ప్రత్యేక చర్యలు

లక్ష్మణచాంద: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ఇంటర్‌ బోర్డు ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల బలోపేతం కోసం ప్రత్యేక చర్యలు చేపడుతున్నాయి. ఇప్పటికే కళాశాలల్లో విద్యార్థులకు మౌలిక వసతులు కల్పించడంతోపాటు ఉచితంగా పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్‌లు అందజేస్తున్నారు. ప్రస్తుతం ప్రభుత్వ ఇంటర్‌ కళాశాలల ప్రయోగశాలలకు నిధులు మంజూరు చేశారు.

ప్రథమ సంవత్సరం నుంచే ప్రయోగాలు..

2026–27 విద్యా సంవత్సరం నుంచి ఇంటర్‌ రెండో సంవత్సరం విద్యార్థులతోపాటు మొదటి సంవత్సరం విద్యార్థులకు కూడా ప్రయోగ పరీక్షలు నిర్వహించనున్నారు. దీనికి మొదటి సంవత్సరానికి 15 మార్కులు కేటాయించారు. ఈ మేరకు నిధులు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

పరికరాల కొనుగోలుకు నిధులు..

ఇంటర్‌ బోర్డు ప్రభుత్వ కళాశాలల ప్రయోగశాలలకు నిధులు మంజూరు చేసింది. ఈ నిధుల ద్వారా ప్రయోగశాలలకు అవసరమైన సామగ్రి, సదుపాయాలు, పరికరాలు, రసాయనాలు కొనుగోలు చేయాలని బోర్డు అధికారులు సూచించారు. ఈ విషయంపై ఆయా కళాశాలల ప్రిన్సిపాళ్లకు ఇంటర్‌ బోర్డు నుంచి ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది.

విద్యార్థుల సంఖ్య ఆధారంగా నిధులు..

జిల్లాలో మొత్తం 13 ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలు ఉన్నాయి. వీటిలో ప్రథమ సంవత్సరంలో 2,516 మంది, రెండో సంవత్సరంలో 2,338 మంది విద్యార్థులు చదువుతున్నారు. మొత్తం 4,854 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. గతేడాది ఒక్కో కళాశాలకు రూ.25 వేలు కేటాయించారు. ఈ సంవత్సరం విద్యార్థుల సంఖ్య ఆధారంగా నిధులు కేటాయించారు. 50 మంది లోపు విద్యార్థులు ఉన్న కళాశాలకు రూ.24 వేలు, 100 మందిలోపు ఉంటే రూ.40 వేలు, 200 మంది వరకు ఉంటే రూ.60 వేలు, 350 మంది వరకు ఉంటే రూ.80 వేలు, 350 మందికి పైగా ఉంటే రూ.లక్ష చొప్పున నిధులు మంజూరు చేశారు. జిల్లాలో ఒక్కో కళాశాలకు రూ.80 వేలు మంజూరయ్యాయి.

పరికరాలు కొనుగోలు చేయాలి..

జిల్లాలోని 13 ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలకు ప్రయోగశాలల్లో పరికరాలు, రసాయనాలు, అవసరమైనవి సమకూర్చుకోవడానికి ప్రభుత్వం నిధులు కేటాయించింది. ఈ నిధులతో విద్యార్థులకు అవసరమైన పరికరాలు, రసాయనాలు కొనుగోలు చేయాలి. నిధులతో విద్యార్థులకు మేలు చేకూరేలా చూడాలి.

– పరశురామ్‌నాయక్‌, ఇంటర్‌ నోడల్‌ ఆఫీసర్‌

కళాశాలలకు మంజూరైన నిధులు..

కళాశాల పేరు మంజురైన నిధులు

జీజేసీ భైంసా రూ.80 వేలు

జీజేసీ నిర్మల్‌(బాలుర) రూ.80 వేలు

జీజేసీ నిర్మల్‌(బాలికలు) రూ.80 వేలు

జీజేసీ ఖానాపూర్‌ రూ.80 వేలు

జీజేసీ మామడ రూ.80 వేలు

జీజేసీ ముధోల్‌ రూ.60 వేలు

జీజేసీ తానూరు రూ.60 వేలు

జీజేసీ దిలావర్‌పూర్‌ రూ.60 వేలు

జీజేసీ సారంగపూర్‌ రూ.60 వేలు

జీజేసీ కడెం రూ.60 వేలు

జీజేసీ లోకేశ్వరం రూ.60 వేలు

జీజేసీ కుభీర్‌ రూ.60 వేలు

జీజేసీ కుంటాల రూ.40 వేలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement