కుభీర్: మండల కేంద్రమైన కుభీర్‌లోని వడ్డెర కాలనీ నుంచి వాగు వరకు డ్రైనేజీ నిర్మాణం కోసం వీబీజీ రామ్‌జీ నుంచి రూ.76 లక్షలు కేటాయించారు. పనులు ప్రారంభించి కొంత వరకు పూర్తి చేవారు. పనులు పూర్తికాకముందే.. నిర్మాణ దశలోనే శుక్రవారం రాత్రి డ్రైనేజీ ఒకవైపు గోడ సుమారు 30 ఫీట్ల వరకు ఇలా కూలిపోయింది. పనులు నాసిరకంగా ఉన్నాయని గ్రామస్తులు, వార్డు సభ్యులు ముందు నుంచే అభ్యంతరం చెబుతున్నారు. కాంట్రాక్టర్ పట్టించుకోలేదు. దీంతో చివరకు నిర్మాణ దశలోనే పుల్లో నాణ్యత బయటపడింది. ఇప్పటికై నా నాన్యతతో పనులు చేగేలా చూడాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఈ విషయమై ఏపీవో హరిలాల్‌ను ప్రశ్నించగా డ్రైనేజీ ప్రక్కన ట్రాక్టర్‌లో బండరాళ్లు వేయడంతో ఒత్తిడితో డ్రైనేజీ కూలిపోయిందని తెలిపారు. క్వాలిటీ కంట్రోల్ వారు వచ్చి పరిశీలిస్తారని చెప్పారు. మరోవైపు విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని వివిధ పార్టీల నాయకులు తహసీల్దార్ శ్రీదేవికి ఫిర్యాదు చేశారు. ఇందులో ఉపసర్పంచ్ గంగాధర్, మాజీ ఎంపీటీసీ బషీర్, కాంగ్రెస్ నాయకుడు బంక బాబు, బీఅర్‌ఎస్ మండల అధ్యక్షుడు అనిల్, వార్డు సభ్యులు ఇషాక్, బబ్లు, నాయకుడు ఫిరోజ్ ఉన్నారు.


