నిర్మల్‌చైన్‌గేట్: జిల్లాలోని ప్రాజెక్టుల్లో అందుబాటులో ఉన్న నీటిని భవిష్యత్తు అవసరాలు దృష్టిలో ఉంచుకుని శాసీ్త్రయంగా, ప్రణాళికాబద్ధంగా వినియోగిస్తామని కలెక్టర్ భవేశ్ మిశ్రా తెలిపారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లాలోని ప్రాజెక్టుల నీటిమట్టం, సాగునీటి లభ్యత, పంటల సాగు, పంట మార్పిడి విధానం తదితర అంశాలపై శనివారం ఇరిగేషన్ అడ్వైజరీ సమావేశం నిర్వహించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటివరకు అవసరమైన మేరకు వర్షపాతం నమోదైనా, కొన్ని మండలాల్లో 20 శాతం లోటు ఉన్నట్లు తెలి పారు. రానున్న రోజుల్లో ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉన్నందున ముందస్తు కార్యాచరణతో సాగునీటి నిర్వహణ చేపడుతున్నామన్నారు. ఎస్సారెస్పీ ద్వారా జిల్లాలో సుమారు 35 వేల ఎకరాలకు, కడెం ప్రాజెక్టు ద్వారా 6 వేల ఎకరాలకు సాగునీరు అందించే అవకాశం ఉందన్నారు. గ్రామసభల ద్వారా ప్రస్తుత పరిస్థితులను రైతులకు వివరించి అవగాహన కల్పిస్తున్నామన్నారు. స్వల్పకాలిక పంటలు సాగు చేసుకునేందు కు సమయం ఉన్నందున రైతులు ఆరుతడి, ప్రత్యామ్నాయ పంటలు వేసుకునేలా వ్యవసాయ అధికా రులు ప్రోత్సహిస్తున్నారని తెలిపారు. ఈ ఏడాది జిల్లాలో కంది సాగు విస్తీర్ణం 10 వేల ఎకరాలకు పెంచినట్లు చెప్పారు. పంట మార్పిడితో నీటి వినియోగం తగ్గి రైతుల ఆదాయం పెరుగుతుందన్నారు. జిల్లాలో ఆయిల్‌పామ్ సాగు గణనీయంగా పెరుగుతోందని, ఇప్పటి వరకు 2,500 ఎకరాలకు సంబంధించి రైతులు డీడీలు సమర్పించినట్లు తెలి పారు. తెలంగాణ జలసిరి పథకం కింద భూగర్భ జలాల పెంపు కోసం ఫామ్‌పాండ్ల నిర్మాణం ప్రోత్సహిస్తున్నామన్నారు. ఈ ఏడాది 2,026 ఫామ్‌పాండ్ల నిర్మాణాన్ని లక్ష్యంగా పెట్టుకోగా, ఇప్పటికే 3 వేల వరకు నిర్మాణానికి రైతులు ముందుకు వచ్చారని తెలిపారు. అంతకుముందు మార్కెట్ కమిటీ చైర్మ న్లు, ప్రజాప్రతినిధులు, సంబంధిత శాఖల అధికా రులతో నిర్వహించిన ఇరిగేషన్ అడ్వైజరీ సమావేశంలో ప్రాజెక్టుల నీటిమట్టం, సాగునీటి నిర్వహణ, భవిష్యత్తు అవసరాలు, ఆరుతడి పంటల ప్రోత్సాహం, ప్రత్యామ్నాయ పంటల సాగుపై చర్చించారు. అదనపు కలెక్టర్ కిశోర్‌కుమార్, నీటిపారుదల శాఖ ఎస్‌ఈ రాజేంద్రప్రసాద్, డీఏవో అంజిప్రసాద్, హార్టికల్చర్ అధికారి రమణ పాల్గొన్నారు.


