ఖానాపూర్: జిల్లా విద్యాశాఖలో పెండింగ్‌లో ఉన్న ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షుడు రాజేశ్‌నాయక్ కోరారు. ఖానాపూర్ పట్టణంలోని మండల విద్యావనరుల కేంద్రంలో శనివారం జరిగిన జిల్లా కార్యవర్గ సభ్యుల సమావేశంలో నిర్వహించారు. జిల్లా విద్యాశాఖ అధికారి ఉపాధ్యాయుల సర్దుబాటును వెంటనే చేయాలన్నారు. జిల్లాలోని ఉపాధ్యాయుల పర్యవేక్షణ కమిటీలు తొమ్మిది నెలలుగా పెండింగ్లో ఉన్నాయని, వెంటనే చేయాలని సూచించారు. అక్రమంగా సెక్రటేరియట్ బదిలీలో పనిచేస్తున్న ఉపాధ్యాయులను తిరిగి సొంత పాఠశాలలకు పంపించాలన్నారు. పాఠశాల విద్యార్థులకు ఆగస్టు 15 నాటికి యూనిఫాం అందేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను కోరారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి క్రాంతి కుమార్, మండల అధ్యక్షుడు బేర చిన్నయ్య, ఉపాధ్యాయ సంఘాల నాయకులు పాల్గొన్నారు.


