బాలకార్మికులకు విముక్తి | - | Sakshi
Sakshi News home page

బాలకార్మికులకు విముక్తి

Aug 2 2026 12:04 AM | Updated on Aug 2 2026 12:04 AM

● ముగిసిన ఆపరేషన ముస్కాన్‌ ● జిల్లాలో 65 మంది గుర్తింపు ● 21 మందిని పాఠశాలల్లో చేర్పించిన అధికారులు

లక్ష్మణచాంద: జిల్లాలో బాలల సంరక్షణ కోసం పోలీసు శాఖ, బాలల సంరక్షణ కమిటీ, చైల్డ్‌లైన్‌ అధికారులతోపాటు అనేక స్వచ్ఛంద సంస్థలు పని చేస్తున్నాయి. ఆర్థిక ఇబ్బందుల కారణంగా బడీడు పిల్లలు బడికి దూరంగా ఉండటమే కాకుండా బాల కార్మికులుగా పని చేస్తున్నారు. అటువంటి వారిని గుర్తించి, పనుల నుంచి విముక్తి కల్పించి, సమీప పాఠశాలలో చేర్పించేందుకు ప్రభుత్వం ఏటా జనవరిలో ఆపరేషన్‌ స్మైల్‌, జూలై నెలలో ఆపరేషన్‌ ముస్కాన్‌ పేరిట నెల రోజులు ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తోంది.

65 మంది గుర్తింపు..

జూలై 1 నుంచి 31 వరకు చేపట్టిన ఆపరేషన్‌ ముస్కాన్‌ నిర్మల్‌ జిల్లా వ్యాప్తంగా ముగిసింది. కార్యక్రమంలో భాగంగా 65 మందిని గుర్తించినట్లు డీసీపీవో దేవి మురళి తెలిపారు. వీరిలో ఉత్తరప్రదేశ్‌కు చెందిన బాలలు ఇద్దరు, మహారాష్ట్రకు చెందినవారు ఒకరు, బీహార్‌కు చెందినవారు ఇద్దరు, రాజస్థాన్‌కు చెందినవారు ఇద్దరు, ఆంధ్రప్రదేశ్‌కు చెందినవారు ఇద్దరు ఉన్నారు. మిగిలిన 56 మంది జిల్లావాసులని వెల్లడించారు. గుర్తించిన పిల్లల్లో పాఠశాల వయసు ఉన్న 21 మందిని సమీప పాఠశాలలో చేర్పించినట్లు అధికారులు తెలిపారు.

51 కేసులు నమోదు

రాష్ట్ర ప్రభుత్వ సూచనల మేరకు కలెక్టర్‌ భవేశ్‌ మిశ్రా ఆదేశాలతో జూలై 1 నుంచి 31 వరకు ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహించారు. ఆపరేషన్‌ ముస్కాన్‌ బృంద సభ్యులు జిల్లా వ్యాప్తంగా హోటళ్లు, వివిధ రకాల దుకాణాలు, ఇటుక బట్టీలు వంటి అనేక ప్రాంతాల్లో పర్యటించారు. బాల కార్మికులను పనుల్లో పెట్టుకున్న వారిని గుర్తించి విముక్తి కల్పించారు. చట్టవ్యతిరేకంగా బాల కార్మి కులను నియమించిన 51 మంది యజమానులపై కేసులు నమోదు చే సినట్లు డీసీపీవో మురళి తెలిపారు.

ప్రత్యేక కమిటీలు

బాలల సంరక్షణ కోసం ప్రత్యేక కమిటీని నియమించారు. ఇందులో స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్‌, ఏఎస్సై, కానిస్టేబుళ్లు, కార్మిక, రెవెన్యూ శాఖ అధికారులు స భ్యులుగా ఉన్నారు. ఈ కమిటీ సభ్యులు తప్పిపోయిన పిల్ల లను గుర్తించి 24 గంటల్లోగా చైల్డ్‌లైన్‌ 1098కు అప్పగిస్తారు. తగిన ఆధారాలు ఉంటే తల్లిదండ్రులకు అప్పగిస్తారు. సరైన చిరునామా లేని పిల్లలను బాలల వసతి గృహాలకు అప్పగిస్తున్నారు. నిర్మల్‌ జిల్లాలో ఒక బాలల సదనం ఉంది.

ఆపరేషన్‌ ముస్కాన్‌ సమాచారం...

గుర్తించిన బాలలు 65

బాలురు 65

బాలికలు 00

బాల కార్మికులు 15

అడల్ట్‌ కార్మికులు 49

డ్రాఫౌట్స్‌ 01

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement