తెలంగాణ కాశ్మీర్‌గా గుర్తింపు పొందిన నిర్మల్–ఆదిలాబాద్ మార్గంలోని సహ్యాద్రి పర్వతాల్లోని మహబూబ్ ఘాట్ ప్రకృతి ప్రేమికులను ఆహ్వానిస్తోంది. పర్వతాలను తాకుతున్న మేఘాలు మనసును దోచుకుంటున్నాయి. పచ్చని అడవులు, కొండలు, మబ్బులు ప్రయాణికులను మైమరిపిస్తున్నాయి. హైదరాబాద్–నాగ్‌పూర్ జాతీయ రహదారి (ఎన్‌హెచ్–44) మార్గంలో ఉన్న ఈ ఘాట్ రోడ్డుపై ప్రయాణం ఆద్యంతం సుందరమైన దృశ్యాలను, ఆహ్లాదకరమైన వాతావరణం మదినిస్తుంది. వ్యూ పాయింట్ల నుంచి చూస్తే చుట్టూ పరుచుకున్న ఎత్తైన కొండల మధ్య బాహుబలి జలపాతం నుంచి జాలువారే పాలవంటి జల ప్రవాహంలో ప్రకృతి ప్రేమికులు తడిసి మురిసిపోతున్నారు. మహబూబ్ ఘాట్ వద్ద ప్రకృతి అందాలను కెమెరాల్లో బంధిస్తూ ఉల్లాసంగా గడుపుతున్నారు. – సాక్షి ఫొటోగ్రాఫర్ నిర్మల్


