రసాయనాల ఫ్యాక్టరీలో ఘోర అగ్ని ప్రమాదం

Workers killed in Surat chemical factory blast - Sakshi

ఏడుగురు మృతి, మరో 25 మందికి గాయాలు

సూరత్‌: గుజరాత్‌లోని సూరత్‌లోని ఓ రసాయనాల కర్మాగారంలో సంభవించిన పేలుడు, ఘోర అగ్ని ప్రమాదంలో ఏడుగురు సజీవదహనమయ్యారు. మరో 25 మంది గాయాలపాలయ్యారు.

సచిన్‌ పారిశ్రామిక ప్రాంతంలోని ఈథర్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ కంపెనీలో గురువారం అర్ధరాత్రి దాటాక 2 గంటల సమయంలో రసాయనాలు నిల్వ ఉన్న ట్యాంకులో అకస్మాత్తుగా పేలుడు సంభవించింది. అనంతరం చెలరేగిన మంటలు కర్మాగారాన్ని చుట్టుముట్టాయి. అగ్నిమాపక సిబ్బంది సుమారు 9 గంటలపాటు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top