ఉత్తరప్రదేశ్‌లో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. భార్యాభర్తల మధ్య అనుమానం భర్త ప్రాణాల మీదకు తెచ్చింది. మరో మహిళతో వివాహేతర సంబంధం ఉందనే కారణంతో దారుణానికి తెగబడింది. మీరట్‌లోని లిసాడి గేట్ పోలీసు స్టేషన్ పరిధిలోని జైద్ గార్డెన్‌లో ఈ ఘటన జరిగింది.
భర్త వాంగ్మూలం ప్రకారం మరో మహిళతో వివాహేతర సంబంధం ఉందన్న అనుమానంతో రగిలి పోయింది. అంతే భర్తకు కాఫీలో మత్తుమందు కలిపి ఇచ్చి, స్పృహ తప్పేలా చేసింది. ఆపై కత్తితో తన జననేంద్రియాలపై దాడి చేసింది. దీంతో తీవ్రంగా గాయపడిన అతని విన్న తల్లి, సోదరి అక్కడికి చేరుకునేలోపు నిందితురాలు అక్కడి నుంచి పరారైంది. వెంటనే కుటుంబ సభ్యులు బాధితుడిని ఆసుపత్రికి తరలించగా, వైద్యులు శస్త్రచికిత్స చేసి రక్తం కారకుండా చికిత్స అందించారు.
ఇదీ చదవండి: భర్త బైక్ పార్క్ చేసి వచ్చేలోపే : లవర్‌తో పరార్
తన భార్యకు తనపై అనుమానం ఉండేదని భర్త వాపోయాడు. తమకు పిల్లలు లేరు గనుక, తాను మరో మహిళను పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నానని భార్య అనుమానించేదని చెప్పాడు. అక్టోబర్ 8న ఈ ఘటన జరిగిందని సర్కిల్ ఆఫీసర్ సంగ్రామ్ సింగ్ తెలిపారు. భర్త ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, నిందితురాలైన భార్యను అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు.
ఇదీ చదవండి: మొన్ననే ప్రేమ పెళ్లి.. తపతి నదిలో తేలిన మృతదేహాలు


