మహారాష్ట్రలో దారుణం చోటు చేసుకుంది. కొన్ని నెలల క్రితం పెళ్లి చేసుకున్న నవ దంపతులు అనుమానాస్పద స్థితిలో నదిలో శవాలైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కాళ్లకు ఇనుప గొలుసులు చుట్టి, తాళం వేసిన స్థితిలో వీరి మృతదేహాలు నది అడుగుభాగంలో లభ్యం కావడం పలు అనుమానాలకు తావిస్తోంది.
ధూలే జిల్లాలో సావల్డే ప్రాంతంలో తపతి నది అడుగుభాగంలో లభించిన ఈ మృతదేహాలు శ్యామ్ హరి పాటిల్ ,స్వప్న పాటిల్ దంపతులవిగా గుర్తించినట్లు అధికారులు తెలిపారు. జల్గావ్ జిల్లా అమల్నేర్ తాలూకాకు చెందిన వీరు, కొద్ది నెలల క్రితమే ప్రేమ వివాహం చేసుకున్నారు. గొలుసులతో వారి కళ్లను కట్టివేయడంతో మాత్రమే కాదు, దానికి తాళం వేసి ఉండటం చూసి పోలీసులే నివ్వరపోయారు. వీరిది ఆత్మహత్యా లేక హత్యనా అనేది ఇంకా స్పష్టంగా తెలియరాలేదని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నామని పోలీసు అధికారి తెలిపారు.
ఇదీ చదవండి : అర్థరాత్రి లవర్ కోసం బోయ్ ఫ్రెండ్..హాట్ టాపిక్‌గా పెళ్లి!
భర్త బైక్ పార్క్ చేసి వచ్చేలోపే : లవర్‌తో పరార్


