అర్థరాత్రి లవర్‌ కోసం బోయ్‌ ఫ్రెండ్‌..హాట్‌ టాపిక్‌గా పెళ్లి! | Boyfriend Secretly Goes To Meet Girlfriend In Muzaffarpur Marriage On Spot | Sakshi
Sakshi News home page

అర్థరాత్రి లవర్‌ కోసం బోయ్‌ ఫ్రెండ్‌..హాట్‌ టాపిక్‌గా పెళ్లి!

Oct 9 2026 3:36 PM | Updated on Oct 9 2026 3:43 PM

Boyfriend Secretly Goes To Meet Girlfriend In Muzaffarpur Marriage On Spot

బిహార్‌లోని ముజఫర్‌పూర్‌లో విచిత్ర సంఘటన  చోటు చేసుకుంది. అర్ధరాత్రి తన ప్రియురాలిని కలవడానికి వెళ్లిన యువకుడికి, ప్రియురాల్ని ఇచ్చి గ్రామస్తులు పెళ్లి చేశారు. అవును మీరు చదివింది నిజమే.. ఈ సంఘటన ఔరై పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది.  అసలు స్టోరీ ఏంటంటే..

కత్రా పోలీస్ స్టేషన్ పరిధి రాంపూర్‌ గ్రామానికి చెందినయువకుడు, అదే  గ్రామానికి చెందిన యువతితో చాలాకాలంగా ప్రేమలో ఉన్నాడు.  రాత్రిళ్లు ప్రియురాల్ని రహస్యంగా కలుసుకునేవాడు. కానీ ఒక రాత్రి అతడు గ్రామస్తులకు దొరికి పోయాడు. దీంతో వారు గట్టిగా నిల దీశారు. అసలు విషయాన్ని తెలుసు కున్నారు. ఇంతలో యువతీ యువకుల కుటుంబ సభ్యులకు సమాచారం అందించడంతో వారు కూడా అక్కడికి చేరుకున్నారు. పరస్పరం చర్చలు, వాదోపవాదాల తరువాత ఇరు కుటుంబాలు ఆ ప్రేమికులను ఒక్కటి చేసేందుకు అంగీకరించారు.

ఇదీ చదవండి : అక్టోబర్‌ 10 సీజేపీ నిరసన : షాకిచ్చిన ఢిల్లీ పోలీసులు
అనుకున్నదే తడవు,  ఆ రాత్రే  పెద్దల సమక్షంలో ఔరాయ్ బ్లాక్ కాంప్లెక్స్‌లోని శివాలయంలో  పండితుల వేద మంత్రాల మధ్య ఇరువురి వివాహం జరిపించారు. శివాలయ పూజారి వేదమంత్రాల నడుమ వివాహ తంతును నిర్వహించారు. అంతేకాదు తండ్రి లేని ఆ యువతికి స్థానిక సామాజిక కార్యకర్త అర్జూ అహసన్ కరీమి 'కన్యాదానం' చేశారు. దీంతో ఈ పెళ్లి స్థానికంగా చర్చ నీయాంశంగా  మారింది.

అర్ధరాత్రి పట్టుబడటం, గ్రామస్థుల జోక్యంతో వెంటనే పెళ్లి జరగడం ఇదంతా   ఏదో కలలా భలే జరిగింది అంటూ ఆ ప్రాంతంలో హాట్ టాపిక్‌గా మారింది. చివరకు ఇరు కుటుంబాల పెద్దలు, గ్రామస్థులు నూతన దంపతులను ఆశీర్వదించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement