భర్త బైక్‌ పార్క్‌ చేసి వచ్చేలోపే : లవర్‌తో పరార్‌ | Husband Goes to Park Bike Wife Allegedly Elopes With Lover | Sakshi
Sakshi News home page

భర్త బైక్‌ పార్క్‌ చేసి వచ్చేలోపే : లవర్‌తో పరార్‌

Oct 9 2026 4:43 PM | Updated on Oct 9 2026 4:51 PM

Husband Goes to Park Bike Wife Allegedly Elopes With Lover

మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో జరిగిన ఒక దిగ్భ్రాంతికరమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. కొత్తగా పెళ్లైన 21 ఏళ్ల  యువకుడు తన భార్యను అలా సరదాకా షికారుకు తీసుకెళ్లాడు. ఒకచోట అలా తన బైక్‌ పార్క్‌ చేసి వచ్చేలోపే కొత్త పెళ్లి కూతురు అతనికి భారీ షాకిచ్చింది.

భర్త  ఫిర్యాదు ప్రకారం  నవదంపతులిద్దరూ బైక్‌ మీద తొలిసారి  బంధువులను కలవడానికి, గ్వాలియర్‌కు వచ్చారు. ఆ తరువాత ఫూల్‌బాగ్ జూ  చూడ్డం కోసం బయలుదేరారు. 18 ఏళ్ల భార్యను జంతు ప్రదర్శనశాల బయట దింపి, తన బైక్‌ను పార్క్ చేసి వస్తానని, ఇక్కడే ఉండమని చెప్పి వెళ్లాడు.  చెప్పాడు. అతను తిరిగి వచ్చేసరికి, ఆమె అక్కడ లేదు. అతను చుట్టుపక్కల ప్రాంతమంతా వెతకగా, ఆమె ప్రియుడితో లిసి  మరో బైక్‌పై వెళ్లిపోయిందని తర్వాత తెలుసుకున్నాడు. ఈ సంఘటన సీసీటీవీలో రికార్డ్ అయింది. ప్రస్తుతం ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

 ఈ ఘటనపై అతడు పోలీసులు ఫిర్యాదు చేశాడు.  అర్మాన్ ఖాన్ వ్యక్తి తన భార్యను తీసుకెళ్లాడని తెలిపాడు. సమాచారం అందుకున్న పడావ్ పోలీస్ స్టేషన్ అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.ఘటనా స్థలం సమీపంలో అమర్చిన సీసీటీవీ కెమెరాల నుంచి, ఆ మహిళ మరో వ్యక్తి మోటార్‌సైకిల్‌పై వెళ్తున్న దృశ్యాలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

 

ఆమె ఎవరితో ఉంది, వారు ఏ దిశగా వెళ్లారు అనే విషయాలను నిర్ధారించడానికి పోలీసులు జూ ప్రాంగణం, చుట్టుపక్కల ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నామని పడావ్ పోలీస్ స్టేషన్ ఇన్‌చార్జ్ శైలేంద్ర భార్గవ తెలిపారు. వారి మొబైల్ ఫోన్ లొకేషన్ డేటాను ట్రాక్‌ చేస్తున్నట్టు  చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement