అపురూపమైనదమ్మ ఆడజన్మ.. ఈ ఇల్లాలు ఏం చేసిందో చూడండి.. | Wife brings home cooked dinner to bank security guard | Sakshi
Sakshi News home page

అపురూపమైనదమ్మ ఆడజన్మ.. ఈ ఇల్లాలు ఏం చేసిందో చూడండి..

Oct 10 2026 5:31 PM | Updated on Oct 10 2026 6:34 PM

Wife brings home cooked dinner to bank security guard

ప్రేమకు హోదా, డబ్బుతో సంబంధం లేదని నిరూపించే ఓ అందమైన దృశ్యం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. రాత్రి వేళ బ్యాంకులో విధులు నిర్వహిస్తున్న భర్తకు ఇంట్లో వండిన భోజనాన్ని తీసుకొచ్చిన భార్య.. అతడితో కలిసి అక్కడే కూర్చొని భోజనం చేసింది. పని ఒత్తిడి మధ్య కూడా భర్తతో కొంత సమయం గడపాలన్న ఆమె ప్రయత్నం నెటిజన్ల మనసులను గెలుచుకుంటోంది.  

మధ్యలో షట్టర్‌ మూసి ఉన్న బ్యాంకు.. బయట చిన్న బల్ల.. దానిపై భోజనం చేస్తున్న దంపతులు.. ఈ సాధారణ దృశ్యమే ఇప్పుడు ఎంతోమందిని ఆకట్టుకుంటోంది. ఈ వీడియోలో కనిపిస్తున్న వ్యక్తి హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు శాఖలో భద్రతా సిబ్బందిగా పనిచేస్తున్నాడు. అతడు రాత్రి విధుల్లో ఉండగా, అతడి భార్య ఇంట్లో వండిన భోజనాన్ని తీసుకొచ్చింది.

బ్యాంకు ప్రవేశ ద్వారం బయట ఉన్న ఎత్తైన వేదికపై చిన్న బల్ల దగ్గర ఇద్దరూ కూర్చున్నారు. ప్రశాంతమైన వాతావరణంలో భోజనం చేస్తూ మాట్లాడుకున్నారు. కేవలం 20 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియోలో.. భార్యాభర్తలు ఒకరితో ఒకరు సమయం గడుపుతున్న దృశ్యాలు కనిపించాయి.

‘సంతోషంలో తోడుండకపోవచ్చు.. కష్టాల్లో మాత్రం ఎప్పుడూ ఉంటా’ అని రాసి ఈ వీడియోను జ్ఞానద్ భట్ అనే ఎక్స్‌ యూజర్‌ పోస్ట్‌ చేశాడు. దానిపై “In your highs, maybe. In your lows, always” అనే వాక్యం కనిపిస్తుంది. అంటే.. జీవితంలో సంతోషంగా ఉన్నప్పుడు తోడుండకపోవచ్చు.. కష్టాల్లో మాత్రం ఎప్పుడూ అండగా ఉంటాననే భావం దీనిలో ఉంది.

కెరీర్‌, హోదా, డబ్బుకే ప్రాధాన్యం పెరుగుతున్న ఈ రోజుల్లో.. సమాజం దృష్టిలో పెద్దగా ఏమీ లేని వ్యక్తికి కూడా జీవితంలో అత్యంత విలువైనది ఉండవచ్చని జ్ఞానద్ భట్ తన పోస్టులో పేర్కొన్నారు. కొన్ని బంధాలు భూమిపై ఏర్పడేవి కావని, స్వర్గంలోనే నిర్ణయమవుతాయన్న భావనను కూడా వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి: అందుకే జంతర్‌ మంతర్‌ వద్ద ఆందోళనలు: నితిన్‌ నబీన్‌

నెటిజన్ల ప్రశంసలు
ఈ వీడియోపై పలువురు నెటిజన్లు స్పందించారు. వంట చేయడం, ఇంటిని చూసుకోవడం, కుటుంబానికి అండగా నిలవడం వంటి పనులను కేవలం బాధ్యతలుగా కాకుండా ప్రేమను వ్యక్తం చేసే మార్గాలుగా చూడాలని ఓ యూజర్‌ అభిప్రాయపడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement