బీజేపీకి షాక్.. ఎంపీ రాజీనామా - కారణం ఏంటంటే.. | West Bengal BJP MP Kunar Hembram Resign | Sakshi
Sakshi News home page

బీజేపీకి షాక్.. ఎంపీ రాజీనామా - కారణం ఏంటంటే..

Mar 9 2024 8:27 PM | Updated on Mar 9 2024 8:34 PM

West Bengal BJP MP Kunar Hembram Resign - Sakshi

పశ్చిమ బెంగాల్‌లో లోక్‌సభ ఎన్నికలు జరగక ముందే.. ఝర్‌గ్రామ్‌కు చెందిన బీజేపీ ఎంపీ 'కునార్ హెంబ్రమ్' (Kunar Hembram) తన పదవికి రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాల వల్ల మాత్రమే పార్టీకి రాజీనామా చేసినట్లు హేంబ్రామ్ పేర్కొన్నారు. 

కొన్ని రోజుల క్రితమే హెంబ్రమ్ తన నిర్ణయాన్ని పార్టీకి తెలియజేశారని రాష్ట్ర బీజేపీ అధికార ప్రతినిధి సమిక్ భట్టాచార్య తెలిపారు. త్వరలో జరగనున్న ఎన్నికల సందర్భంగా కునార్ హెంబ్రమ్ తీసుకున్న ఈ నిర్ణయం అనేక ఊహాగానాలకు దారితీసింది. అయితే తాను మరే ఇతర రాజకీయ పార్టీలో చేరడం లేదని స్పష్టం చేశారు.

బీజేపీ నేత రాజీనామాపై టీఎంసీ స్పందిస్తూ.. ఓటమిని పసిగట్టి రాజీనామా చేసినట్లు పేర్కొన్నారు. బీజేపీ సీటును కోల్పోతుందని ఆయనకు ముందుగానే తెలుసు. అందుకే ఆయన వైదొలగాలని నిర్ణయించుకున్నారని టీఎంసీ ఎంపీ శాంతను సేన్ అన్నారు. ఇది ప్రారంభం మాత్రమే ఇలాంటి పరిణామాలు బీజేపీలో ముందు ముందు మరిన్ని జరుగుతాయని వెల్లడించారు.

Advertisement
 
Advertisement
Advertisement