రాజ్యసభలో వక్ఫ్‌ బిల్లు.. వాడీవేడి చర్చ | Waqf Amendment Bill Tabled In Rajya Sabha Live Updates | Sakshi
Sakshi News home page

రాజ్యసభలో వక్ఫ్‌ బిల్లు.. వాడీవేడి చర్చ

Apr 3 2025 1:32 PM | Updated on Apr 3 2025 1:54 PM

Waqf Amendment Bill Tabled In Rajya Sabha Live Updates

Waqf Bill In Rajya Sabha Updates..

👉వక్ఫ్‌ బిల్లుపై రాజ్యసభలో చర్చ నడుస్తోంది.

👉వక్ఫ్ సవరణ బిల్లును రాజ్యసభలో కేంద్రమంత్రి కిరణ్‌ రిజుజు ప్రవేశపెట్టారు.

వక్ఫ్‌ బిల్లు పేరు మార్పు

  • కేంద్రమంత్రి కిరణ్‌ రిజుజు కామెంట్స్‌..
  • వక్ఫ్‌ బిల్లును యూఎంఈఈడీగా పేరు మార్పు
  • UMEED (Unified Waqf Management Empowerment Efficiency and Development) బిల్లుగా మార్చినట్టు వ్యాఖ్యలు.

 

 

👉వక్ఫ్‌ సవరణ బిల్లుకు కాంగ్రెస్‌ సహా ప్రతిపక్ష పార్టీల నేతలు మద్దతు ఇవ్వాలని కోరారు. 

చైనా ఆక్రమించిన భూమి తిరిగి రావాలి: రాహుల్‌

  • ఈ విషయంపై ప్రధాని, రాష్ట్రపతి చైనా ప్రభుత్వానికి లేఖ రాసినట్లు తెలిసింది
  • చైనా రాయబారి ద్వారా ఈ విషయం బయటపడింది
  • ట్రంప్‌ సుంకాలు విధించడంపై కేంద్ర ప్రభుత్వ స్పందన తెలియజేయాలని రాహుల్‌ డిమాండ్‌

ఎంపీ అనురాగ్‌ ఠాకూర్‌పై ఖర్గే సీరియస్‌..

  • బీజేపీ ఎంపీ అనురాగ్‌ ఠాకూర్‌ నిన్న నాపై అసత్య, నిరాధార ఆరోపణలు చేశారు.
  • మా పార్టీ ఎంపీలు ప్రశ్నించడంతో ఆ వ్యాఖ్యలను ఆయన ఉపసంహరించుకున్నారు.
  • కానీ, అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.
  • సోషల్‌ మీడియా, మీడియాల్లో బీజేపీ ఎంపీ చేసిన ఆరోపణలే వైరల్‌ అవుతున్నాయి.
  • అందువల్లే ఈ రోజు నేను నిలబడి ఆయన ఆరోపణలను ఖండించాల్సి వస్తోంది.
  • ఆయన వ్యాఖ్యలకు గానూ సభాపక్ష నేత క్షమాపణలు చెప్పాలి’’ అని ఖర్గే డిమాండ్‌ చేశారు.
  • నా జీవితం తెరిచిన పుస్తకం. ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నా.
  • అయినప్పటికీ ప్రజా జీవితంలో తలెత్తుకొని నిలబడ్డా.
  • అలాంటి నాపై అసత్య ప్రచారం చేస్తున్నారు.
  • ఈ ఆరోపణలను ఠాకూర్‌ నిరూపించగలరా?
  • ఒకవేళ అలా చేస్తే నేను రాజీనామా చేస్తా.
  • లేదంటే ఆయనకు పార్లమెంట్‌లో ఉండే అర్హత లేదు.
  • రాజీనామా చేయాల్సిందే. ఇలాంటి రాజకీయ దాడులతో బీజేపీ నేతలు నన్ను భయపెట్టాలని చూస్తున్నారు.
  • గుర్తుంచుకోండి. నేను ఎవరికీ భయపడను. తలొగ్గను అని అన్నారు.

లోక్‌సభలో ఠాకూర్‌ కామెంట్స్‌.. 

  • వక్ఫ్‌ బోర్డు ఆస్తులను కాంగ్రెస్‌, ఇతర ప్రతిపక్ష పార్టీలు బాధ్యతారహితంగా వినియోగిస్తున్నాయని ఆరోపించారు. 
  • ఎలాంటి అనుమతి లేకుండా ఆ భూములను కబ్జా చేశారంటూ ఖర్గేపై ఆరోపణలు చేశారు. 
  • దీనిపై కాంగ్రెస్‌ నేతలు తీవ్రంగా మండిపడ్డారు.

సోనియా గాంధీ కీలక వ్యాఖ్యలు..

  • పార్లమెంటులో ప్రతిపక్షాలను మాట్లాడేందుకు సమయం ఇవ్వడం లేదు.
  • కాంగ్రెస్‌ సభ్యులు తమ సమస్యలను లేవనెత్తనివ్వకుండా సభలో గందరగోళం సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు.
  • వక్ఫ్‌ సవరణ బిల్లు రాజ్యాంగంపై దాడి చేయడమే.
  • దిగువ సభలో ఈ బిల్లును తొక్కేశారు.
  • మోదీ ప్రభుత్వం విద్య, పౌర హక్కులు, స్వేచ్ఛ, సమాఖ్య నిర్మాణం, ఎన్నికల నిర్వహణ ఏదైనా దేశాన్ని అగాధంలోకి లాగుతోంది.
  • రాజ్యాంగం అనేది కేవలం కాగితాలకే పరిమితమైంది.
  • దాన్ని కూడా కూల్చేయాలనేదే వారి ఉద్దేశమని మాకు తెలుసు.
  • మోదీ ప్రభుత్వ వైఫల్యాలను, వారి ఉద్దేశాలను బహిర్గతం చేయాలి.
  • ఏది సరైనది, ఏది న్యాయబద్ధమైనది అనేది ప్రజలకు తెలియజేసేందుకు అందరం కలిసి మన పోరాటాన్ని కొనసాగించాలి.
  • రాజ్యాంగాన్ని అపహాస్యం చేయడానికే ఒకే దేశం, ఒకే ఎన్నిక బిల్లును తీసుకొస్తున్నారని ఆరోపించారు.
  • దీన్ని తమ పార్టీ  వ్యతిరేకిస్తుందన్నారు.
  • బీజేపీ సభ్యులు కాంగ్రెస్‌ పాలిత రాష్ట్ర ప్రభుత్వాలని టార్గెట్‌ చేశారు.
     

👉రాజ్యసభలో ఈ బిల్లు ఇప్పుడు కీలకమైన పరీక్షను ఎదుర్కొంటోంది. ఇక్కడ ప్రస్తుత సభ్యుల మొత్తం బలం 236. బిల్లును ఆమోదించడానికి అధికార ఎన్డీయే కూటమికి 119 ఓట్లు అవసరం. స్వతంత్ర, నామినేటెడ్ సభ్యుల మద్దతుతో, దాని సంఖ్య 125గా ఉంది. ప్రతిపక్షం వద్ద 95 ఓట్లు ఉండగా 16 మంది సభ్యులు ఇంకా నిర్ణయం తీసుకోలేదు.

👉లోక్‌సభలో వక్ఫ్‌ బిల్లు ఆమోదం పొందింది. ఈ బిల్లుకు అనుకూలంగా 288 ఓట్లు, వ్యతిరేకంగా 232 ఓట్లు వచ్చాయి. ప్రతిపక్ష సభ్యులు 100 కు పైగా సవరణలను ప్రతిపాదించారు అయితే ఓటింగ్ సమయంలో అవన్నీ తిరస్కరించారు. దాదాపు 12 గంటల చర్చ అనంతరం వక్ఫ్ సవరణ బిల్లును స్పీకర్ ఆమోదించారు.

 

Advertisement
 
Advertisement
Advertisement