బాలికపై అత్యాచారం.. కాల్పుల్లో నిందితునికి గాయాలు | Uttar Pradesh Encounter of Accused | Sakshi
Sakshi News home page

బాలికపై అత్యాచారం.. కాల్పుల్లో నిందితునికి గాయాలు

Aug 26 2024 9:44 AM | Updated on Aug 26 2024 9:54 AM

Uttar Pradesh Encounter of Accused

ఉత్తరప్రదేశ్‌లో మరో అత్యాచార ఉదంతం వెలుగు చూసింది. డియోరియా జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది.  41 ఏళ్ల వ్యక్తి  ఏడేళ్ల బాలికపై అత్యాచార నేరానికి పాల్పడ్డాడు. బాధిత బాలిక పాల ప్యాకెట్‌ కొనేందుకు ఇంటికి సమీపంలోని దుకాణానికి వెళ్లిన సమయంలో ఈ ఘటన జరిగిందని అదనపు పోలీసు సూపరింటెండెంట్ దీపేంద్ర నాథ్ చౌదరి తెలిపారు. నిందితుడు దుకాణదారునికి తెలిసినవాడేనని పోలీసులు తెలిపారు. బాధిత బాలిక ఆర్తనాదాలు విన్న స్థానికులు ఆ చిన్నారిని కాపాడి, ఈ విషయాన్ని పోలీసులకు తెలిపారు.

ఈ ఘటనపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు పోలీసు సూపరింటెండెంట్ సంకల్ప్ శర్మ తెలిపారు. స్థానిక బీజేపీ ఎమ్మెల్యే శలభ్ మణి త్రిపాఠి  నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను డిమాండ్ చేశారు. కాగా అత్యాచార నిందితుడు సైఫుల్లాను పోలీసులు అరెస్టు చేసేందుకు వెళ్లగా, అతడు  తప్పించుకుని పారిపోయే ప్రయత్నం చేశాడు. వెంటనే పోలీసులు అప్రమత్తమై, ఎన్‌కౌంటర్‌ జరిపారు. పోలీసులు నిందితుని కాలిపై కాల్పులు జరిపారు. తరువాత నిందితుని నుంచి పిస్టల్, కాట్రిడ్జ్‌లను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించిన పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement