Patna: బీజేపీ నేత దారుణ హత్య | Unknown Goons Killed BJP Leader Munna Sharma | Sakshi
Sakshi News home page

Patna: బీజేపీ నేత దారుణ హత్య

Sep 9 2024 9:25 AM | Updated on Sep 9 2024 9:57 AM

Unknown Goons Killed BJP Leader Munna Sharma

పట్నా: బీహార్ రాజధాని పట్నాలో బీజేపీ నేత శ్యామ్‌ సుందర్‌శర్మ హత్యకు గురయ్యారు. పట్నాలోని చౌక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రామ్‌దేవ్ మహతో కమ్యూనిటీ హాల్ సమీపంలో  ఈ ఘటన చోటుచేసుకుంది. ఘటనకు పాల్పడిన అనంతరం నిందితులు బైక్‌పై అక్కడి నుంచి పరారయ్యారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు.

మీడియాకు అందిన వివరాల ప్రకారం బీజేపీ నేత శ్యామ్ సుందర్ శర్మ అలియాస్ మున్నా శర్మ చౌక్ మండల బీజేపీ మాజీ అధ్యక్షునిగా పనిచేశారు. సోమవారం ఉదయం ఆయన ఇంటి నుంచి బయటకు వచ్చారు. అతని మెడలోని బంగారు గొలుసును అటుగా వచ్చిన దుండగులు లాక్కుపోయే ప్రయత్నం చేశారు. ఈ నేపధ్యంలో శ్యామ్‌ సుందర్‌ వారిని అడ్డుకున్నారు. దీంతో దుండగులు తుపాకీలో శ్యామ్‌ సుందర్‌ తలపై కాల్పులు జరిపారు. దీంతో అతను అక్కడిక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసు సంఘటనా స్థలానికి చేరుకుని, అక్కడ లభ్యమైన సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. వీటి ఆధారంగా  దర్యాప్తు చేపట్టనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement